అందరూ ఎదురుచూసే క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున క్రిస్టియన్లు చర్చికి వెళ్లి యేసు క్రీస్తును ప్రార్థిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చిలు నేడు లైట్లతో కలకలలాడుతుంటాయి. నేడు యేసుక్రీస్తు జన్మించారని అందుకే ఈ క్రిస్మస్‌ను జరుపుకుంటారని చెప్పుకుంటారు. అయితే ఈ రోజు యేసుక్రీస్తు జన్మించిన రోజు కాదట. అసలు యేసుక్రీస్తు నేడు జన్మించినట్లు ఎక్కడా కూడా బైబిల్‌లో లేదట. ఇది కూడా చూడండి: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు.. రోమన్లు మొదటిగా సూర్యభగవానుని.. నిజం చెప్పాలంటే జీసస్ ఎప్పుడు జన్మించారనే విషయం ఎవరికీ తెలియదు. ఈ క్రిస్మస్ పండుగను మొదటిగా రోమన్లు జరుపుకునేవారట. సూర్య భగవానుడిని ప్రధాన దేవతగా భావించి రోమన్లు డిసెంబర్ 25న ఆయన పుట్టిన రోజు నిర్వహించేవారు. ఆ తర్వాత క్రీ.పూ 1855లో యేసుక్రీస్తే సూర్యభగవానుడిగా అవతరించాడని కొందరు నమ్మారు. ఇక అప్పటి నుంచి డిసెంబర్ 25న క్రిస్టియన్లు క్రిస్మస్‌ను జరుపుకుంటున్నారు. సూర్య భగవానుడి జన్మదినం కాస్త.. యేసుక్రీస్తు జన్మదినంగా మారిందని చెబుతుంటారు. ఇది కూడా చూడండి: SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో.. ఎందుకు జరుపుకుంటారంటే? క్రిస్మస్ పండుగను జరుపుకోవడం వల్ల ఆ యేసుక్రీస్తు దీవెనలు ఎప్పుడు ఉంటాయని క్రిస్టియన్లు నమ్ముతారు. ఈ రోజున ఇంటిని లైట్లు, స్టార్లు, క్రిస్మస్ ట్రీలతో అలంకరిస్తారు. అలాగే క్రిస్టియన్లు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు జీసస్ నెరవేరుస్తారని నమ్ముతారు. వీటితో పాటలు, ఆటలతో నేడు ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చూడండి: KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్.. ఇది కూడా చూడండి: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. వచ్చే ఏడాది సేవలు నిషేధం