Induction Stove Safety Tips: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే చాలా ప్రమాదం..!

భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది కరెంట్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ వస్తువులను కొనుక్కుంటున్నారు. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలకి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌లు కిచెన్‌లో రాజ్యమేలుతున్నాయి.

New Update
Induction  cooktop  safety Tips (1)

Induction stove safety Tips

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది కరెంట్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ వస్తువులను కొనుక్కుంటున్నారు. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలకి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌లు కిచెన్‌లో రాజ్యమేలుతున్నాయి. అయితే ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉన్నా.. వాడేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అందువల్ల వీటిని ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

చేయకూడని పొరపాట్లు

ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్‌ వాడుతున్న చాలా మంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎక్కువగా వంటకు ఉపయోగించే సరైన పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ అనేది విద్యుదయస్కాంత శక్తిపై ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి దీనిపై రాగి, అల్యూమినియం, గాజు వంటి పాత్రలు పెట్టకూడదు. కేవలం అడుగుభాగం సమతలంగా ఉండే స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలనే వాడాలి. 

అలాగే ఇండక్షన్ స్టవ్ కొద్ది క్షణాల్లోనే పాత్రను వేడి చేస్తుంది కాబట్టి.. దానిపై ఖాళీ పాత్ర పెట్టి ఆన్ చేసి ఉంచకూడదు. దీనివల్ల పాత్ర అడుగుభాగం దెబ్బతింటుంది. ఇది మాత్రమే కాకుండా స్టవ్ ‌పైన ఉండే గ్లాస్ పగిలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

అది మాత్రమే కాకుండా ఇండక్షన్ స్టవ్‌పై వంటలు చేసేవారు.. స్టవ్ ప్యానెల్‌పై నీళ్లు పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎలక్ట్రిక్ వస్తువు. కాబట్టి దానిపై నీరు పడితే అది షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే తడి చేతులతో స్టవ్ బటన్స్ ప్రెస్ చేయకూడదు. 

ఇండక్షన్ స్టవ్ వెనుక లేదా కింద భాగంలో ఒక ఫ్యాన్ అమర్చబడి ఉంటుంది. ఇది రన్నింగ్ టైంలో సర్క్యూట్‌ను కూల్ చేస్తుంది. అందువల్ల దీన్ని గోడకు దగ్గరగా ఆనించి పెట్టకూడదు. అలా చేస్తే గాలి సరిగా ఆడక మెషిన్ కాలిపోయే అవకాశం ఉంటుంది. 

అలాగే స్టవ్‌పై భారీ బరువున్న పాత్రలను కూడా పెట్టకూడదు. దీనివల్ల పైనున్న గ్లాస్ పగిలిపోయే అవకాశం ఉంటుంది.

దీనిని అతిగా వాడటం వలన విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో ప్రతి నెలా కరెంట్ బిల్లులు భారీగా వచ్చే అవకాశం ఉంది. కాగా గుండె సంబంధిత పేస్ మేకర్లు ఉన్నవారు.. ఈ ఇండక్షన్ స్టవ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీని నుండి వచ్చే అయస్కాంత తరంగాలు వాటిపై అధిక ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. 

Advertisment
తాజా కథనాలు