Health Tips: వీర్యకణాలు ఎంతకాలం సజీవంగా ఉంటాయి?

సాధారణంగా వీర్యంలో దాదాపు 85% నీరు ఉంటుంది. నీరు ఎండిపోతే వీర్యం గడ్డ కట్టడం ప్రారంభిస్తుంది. గదిలో ఉష్ణోగ్రత కారణంగా ఆ వీర్యకణాలు దాదాపు మూడు గంటలు మాత్రమే సజీవంగా ఉంటాయి. మామూలుగా అయితే మగవారి శరీరంలో వీర్యకణాలు 74 రోజుల వరకు ఉండగలుగుతాయి.

New Update
Sperm

Sperm

Health Tips: వీర్యం.. సంతానం కలగడంలో ఇది ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే వీర్యం బయట వాతావరణంలో ఎంతసేపు ఉంటుంది. అసలు దాని జీవితకాలం ఎంత?. అయితే వైద్యులు మాత్రం స్కలనం తర్వాత వీర్యం ఎంతసేపు సజీవంగా ఉంటుందనేది బయట వాతావరణంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఒక గదిలో దాదాపు 25 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వీర్యంలో నీరు ఉన్నంత వరకు కణాలు ఆరు గంటల వరకు సజీవంగా ఉంటాయి. 

శరీరంలో వీర్యకణాలు 74 రోజుల వరకు..

సాధారణంగా వీర్యంలో దాదాపు 85% నీరు ఉంటుంది. నీరు ఎండిపోతే వీర్యం గడ్డ కట్టడం ప్రారంభిస్తుంది. గదిలో ఉష్ణోగ్రత కారణంగా ఆ వీర్యకణాలు దాదాపు మూడు గంటలు మాత్రమే సజీవంగా ఉంటాయి. మామూలుగా అయితే మగవారి శరీరంలో వీర్యకణాలు 74 రోజుల వరకు ఉండగలుగుతాయి. ఆడవారి శరీరంలోని గర్భాశయ ద్వారం దగ్గర ఉన్న మ్యూకస్ లో 5 రోజుల వరకు వీర్య కణాలు సజీవంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఈ వస్తువులతో పాములు పరార్‌.. వాసన వల్ల మళ్లీ కనిపించవు

అండం విడుదల కావడానికి ముందుగానే వీర్యం కణాలను స్త్రీ అండ వాహికలోకి పంపే అవకాశం ఉండటంతో ఫలదీకరణ శాతం కూడా పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. కాకపోతే సర్విక్స్ దగ్గర మ్యూకస్ లేదా జిగట వంటి పదార్ధం ఆరోగ్యంగా లేకపోతే కూడా వీర్యకణాలు జీవించి ఉండే కాలం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ అలవాట్లతో రెట్టింపు ప్రమాదం..మానుకోకపోతే అంతే సంగతి

 

ఇది కూడా చదవండి: సింహం వేట చూసి ఉంటారు...అది ప్రేమిస్తే ఇలాగే ఉంటది

 

ఇది కూడా చదవండి: ఎక్కువ సేపు పడుకుంటున్నారా..? మీ పని అంతే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు