Cumin Water: జీలకర్రలో థైమోక్వినోన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న సహజ రసాయనం. థైమోక్వినోన్ పొట్ట, నడుము దగ్గర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌పై దాడి చేస్తుంది. దీని కారణంగా శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించబడతాయి. బరువు పెరుగుట సమస్యతో బాధపడుతున్నట్లయితే జీలకర్ర నీటిని తాగవచ్చు. జీలకర్ర నీరు జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విరేచనాలు, వికారం, మార్నింగ్ సిక్నెస్, అపానవాయువు, మలబద్ధకాన్ని జీలకర్ర నివారిస్తుంది. జీలకర్ర నీరు పొట్ట చూట్టు ఉన్న కొవ్వుని ఎలా కరిగిస్తోందో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలి..? జీలకర్ర నీటిని సిద్ధం చేయడానికి ముందుగా రెండు చెంచాల జీలకర్ర తీసుకోండి. రెండు చెంచాల జీలకర్రను ఒక గ్లాసు నీటిలో 10 నిమిషాలు మరించాలి. తర్వాత చల్లగా చేసుకుని ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చు. మెరుగైన జీర్ణక్రియ: జీలకర్ర నీరు జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. విరేచనాలు, వికారం, మార్నింగ్ సిక్నెస్, అపానవాయువు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది కూడా చదవండి: ఈ కషాయం ట్రై చేయండి.. పీరియడ్స్ సమస్య పరార్ బరువు తగ్గడం: పెరుగుతున్న శరీర బరువును తగ్గించుకోవడం జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం. ఇది బొడ్డు కొవ్వును కూడా తగ్గిస్తుంది. శరీరం నుంచి పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతర్గత అవయవాలు బలంగా, మరింత సమర్థవంతంగా పని చేస్తాయి. జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: క్యాన్సర్‌కు AIతో చికిత్స.. ఎలాగంటే?