/rtv/media/media_files/2026/03/23/summer-tips-for-cool-fan-air-telugu-news-3-2026-03-23-20-14-04.jpg)
సమ్మర్‌లో చాలా మంది ట్రిప్స్ వేస్తుంటారు. ఫ్యామిలీ, బ్యాచిలర్స్, లవర్స్, ఫ్రెండ్స్ ఇలా ఎందరో అందమైన ప్రదేశాలు చూడాలని, వాటిని ఆశ్వాదించాలని అనుకుంటారు. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియక తమ ప్లాన్ మార్చుకోవడం చేస్తుంటారు. అలాంటి ఇప్పుడు ఈ వార్తలో కొన్ని అద్బుతమైన, అందమైన స్వర్గాన్ని తలపించే ప్రదేశాలు గురించి తెలుసుకుందాం.
Best Green Destinations
దక్షిణ భారతదేశం ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం. ఇక్కడి పచ్చని పర్వతాలు, పొగమంచుతో కప్పబడిన కొండలు, దట్టమైన అడవులు, ప్రశాంతమైన సరస్సులు, బ్యాక్‌వాటర్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఇక్కడి వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ట్రెక్కింగ్, జూపార్క్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో 5 అందమైన ప్రదేశాల గురించి చూద్దాం.
మున్నార్ (కేరళ)
కేరళలో మున్నార్ అనేది.. విస్తారమైన తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడి చల్లని వాతావరణం, పొగమంచుతో నిండిన పర్వతాలు ప్రకృతి ప్రేమికులకు బాగా నచ్చుతాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయొచ్చు, అనేక రకాల వన్యప్రాణులను చూడొచ్చు. అందులో ఎరవికులం జాతీయ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, టీ మ్యూజియం, టాప్ స్టేషన్ వంటి ప్రదేశాలను సందర్శించొచ్చు.
వయనాడ్ (కేరళ)
వయనాడ్.. దట్టమైన అడవులు, జలపాతాలు, వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గుహలు, పర్వతాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. అలాగే ఎడక్కల్ గుహలు, బాణాసుర సాగర్ డ్యామ్, సూచిపార జలపాతం, వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.
అలెప్పీ (కేరళ)
అలప్పుజ అని కూడా పిలువబడే అలెప్పీ దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రశాంతమైన గమ్యస్థానాలలో ఒకటి. ఇక్కడి కాలువలు, సరస్సులు, బ్యాక్‌వాటర్స్ హౌస్‌బోట్ విహారయాత్రలకు ప్రసిద్ధి చెందాయి. కొబ్బరి చెట్లతో నిండిన జలమార్గాలు, చిన్న గ్రామాల గుండా సాగే పడవ ప్రయాణాలు ప్రశాంతమైన, మరపురాని అనుభూతిని అందిస్తాయి. ఇక్కడి అలెప్పీ బ్యాక్‌వాటర్స్, అలప్పుజ బీచ్, వేంబనాడ్ సరస్సు, హౌస్‌బోట్ ప్రయాణాలు అద్భుతంగా ఉంటాయి.
కోడైకనాల్ ( తమిళనాడు )
కోడైకనాల్ చల్లని వాతావరణం, దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన కొండలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మధ్యలో ఉన్న సరస్సు ఈ ప్రదేశం అందాన్ని మరింత పెంచుతుంది. జంటలకు, ఫ్యామిలీలకు, విశ్రాంతి కోరుకునే వారికి ఈ ప్రదేశం చాలా అనువైనది. ఇక్కడ మీరు కోడైకనాల్ సరస్సు, కోకర్ వాక్, పిల్లర్ రాక్స్, సిల్వర్ కాస్కేడ్ ఫాల్స్‌ను సందర్శించవచ్చు.
కూనూర్ (తమిళనాడు)
కూనూర్ నీలగిరి కొండలలో ఉన్న ఒక ప్రశాంతమైన, అందమైన ప్రదేశం. ఇది తేయాకు తోటలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఊటీ కంటే ఇక్కడ రద్దీ తక్కువగా ఉండి.. మరింత ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో సిమ్స్ పార్క్, డాల్ఫిన్స్ నోస్ వ్యూపాయింట్, లాంబ్స్ రాక్, తేయాకు తోటలు ఉన్నాయి.
Follow Us