/rtv/media/media_files/2025/03/13/IeWNG1RYP7RLWt0JnhrF.jpg)
Vizag Lingampally Janmabhoomi Express train route changed Photograph: (Vizag Lingampally Janmabhoomi Express train route changed)
భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తీపి కబురు అందించింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మే 15 నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించడానికి జూన్ 14 వరకు గడువు ఇచ్చారు. అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
18 నుండి 30 ఏళ్ల మధ్య
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు జూలై 04 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ ప్రకారం పే లెవల్-2 కింద నెలకు రూ. 19,900 ప్రారంభ వేతనంగా లభిస్తుంది. విద్యార్హతలు, మెడికల్ స్టాండర్డ్స్ వంటి పూర్తి వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచే సమగ్ర నోటిఫికేషన్‌లో తెలియజేస్తారు.
దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు అభ్యర్థులు తమ ప్రాథమిక గుర్తింపును ఆధార్ ద్వారా ధృవీకరించుకోవాలని RRB సూచించింది. ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ తప్పనిసరిగా పదో తరగతి సర్టిఫికేట్‌లోని వివరాలతో సరిపోలాలి. అభ్యర్థులు తమ లేటెస్ట్ ఫోటో, బయోమెట్రిక్ వివరాలను కూడా ఆధార్‌లో అప్‌డేట్ చేసి ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులు ముందుగానే అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకునేందుకు ఈ ముందస్తు సమాచారాన్ని విడుదల చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. తదుపరి అప్‌డేట్స్ కోసం కేవలం అధికారిక RRB వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.
Follow Us