Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు!

రష్యా తరుఫున పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు భారీగా చనిపోవడమో, తీవ్రంగా గాయపడడమో జరిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రకటించారు.ఇప్పటికే 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు.

New Update
Volodymyr Zelenskyy

Volodymyr Zelenskyy

Ukraine: రష్యా తరుఫున పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు భారీగా చనిపోవడమో, తీవ్రంగా గాయపడడమో జరిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌  స్కీ ప్రకటించారు.తమ సైనికులతో పోరులో  ఇప్పటికే 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు ప్రాణాలు కోల్పోవడమే లేదా తీవ్రంగా గాయపడడమో జరిగిందన్నారు.కుర్క్స్‌ రీజియన్‌ లో జరుగుతున్న పోరాటానికి సంబంధించి ఆర్మీ కమాండర్‌ నుంచి తనకు నివేదిక అందిందని జెలెన్‌ స్కీ తెలిపారు.

Also Read: Big Breaking: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మెరుపు దాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు

ఆ నివేదిక ప్రకారం..ఉత్తర కొరియా ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలు,ఆయుధ సామాగ్రిని పంపే అవకాశం ఉందన్నారు. రష్యా,ఉత్తర కొరియాల మధ్య ఆధునిక యుద్ధరీతులు,అడ్వాన్స్‌డ్‌ మిలటరీ సాంకేతికత బదిలీ పెరుగుతుండడం నేపథ్యంలో జెలెన్‌ స్కీ ప్రపంచ దేశాలను హెచ్చిరించారు. ఉత్తర కొరియా మరిన్ని బలగాలను తమతో పోరాడేందుకు పంపించనుందని ,అందుకు తాము సిద్దంగా ఉన్నట్లు జెలెన్‌ స్కీ తెలిపారు. 

Also Read: AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!

మాస్కో,ప్యాంగ్‌యాంగ్‌ మధ్య బంధం కారణంగా కొరియా చుట్టున్న దేశాల్లో , జలాల్లో అస్థిరత, ప్రమాదం పెరిగేందుకు అవకాశం ఉందని, దీన్ని ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలని అన్నారు. మరో వైపు తమకున్న సమాచారం ప్రకారం..1100 మంది కిమ్‌ సైన్యం చనిపోయి ఉంటామో లేదా గాయపడడమోజరిగిందని దక్షిణ కొరియా వెల్లడించింది.

Also Read: Manu Bhaker: అవార్డు ఇవ్వమని అడుక్కోవాలా.. ఖేల్ రత్నపై మను తండ్రి ఫైర్

పుతిన్‌తో కిమ్‌ కు ఉన్న మైత్రి నేపథ్యంలో రష్యాసైన్యాన్ని బలోపేతం చేసేందుకు పాంగ్‌యాండ్‌ తమ సైనికులను బరిలోకి దించిన విషయం తెలిసిందే. రష్యాలో శిక్షణ అనంతరం గత కొన్ని నెలల నుంచి ఉత్తర కొరియా సైనికులు కుర్క్య్‌రీజియన్‌ లో ఉక్రెయిన్‌ దళాలతో పోరాడుతున్నారు.  ఆగస్టు నుంచి దాదాపు 12000 మంది ఉత్తర కొరియా సైనికులు ఈ ప్రాంతంలో మోహరించినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది.

Also Read: Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ప్రభాకర్ అరెస్ట్.. వందల్లో నేరాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు