/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదో వంతు వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి వద్ద రక్షణ కల్పించేందుకు సుమారు ఏడు దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కోరారు. అయితే, అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రదేశాలు కూడా ఈ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్నాయి.
Also Read : ప్రపంచ దేశాలకు బిగ్ షాక్.. మరో జలసంధి మూసివేతకు హౌతీల బిగ్ ప్లాన్
ఆ జలసంధి చాలా ముఖ్యమైనదే
తాము యుద్ధ నౌకలను పంపే ఆలోచనలో లేమని ఆస్ట్రేలియా(australia) స్పష్టం చేసింది. ఆ జలసంధి చాలా ముఖ్యమైనదే అయినప్పటికీ, నౌకలను పంపాలని తమకు ఎటువంటి అభ్యర్థన రాలేదని, ప్రస్తుతానికి అలాంటి ప్లాన్ ఏదీ లేదని ఆ దేశ మంత్రి క్యాథరీన్ కింగ్ తేల్చి చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సముద్ర భద్రతా చర్యల కోసం నౌకలను పంపే ఆలోచన లేదని జపాన్(japan) తెలిపింది. తమ దేశ చట్టపరమైన పరిమితులను బట్టి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అక్కడి నాయకులు వెల్లడించారు. దీనిపై అమెరికాతో చర్చిస్తున్నామని, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని దక్షిణ కొరియా పేర్కొంది.
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ ఈ విషయంపై ట్రంప్‌తో చర్చలు జరిపారు. షిప్పింగ్ ఇబ్బందులను తొలగించడానికి జలసంధిని మళ్ళీ తెరిపించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : నెతన్యాహూ బతికున్నా.. వెంటాడి చ*పేస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని మరణంపై ఉత్కంఠ
చమురు ధరలు ఆకాశాన్ని
మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురుపై ఎక్కువగా ఆధారపడే దేశాలే ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చైనా తన చమురు అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఆయన గుర్తు చేశారు. అమెరికాకు ఆ జలసంధితో వచ్చే ఇబ్బంది తక్కువని, కాబట్టి ఏ దేశాలు అయితే ఆ మార్గాన్ని వాడుకుంటాయో, అవే తమ సొంత ప్రాంతంలా దాన్ని రక్షించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఏ దేశం నుంచి కూడా గట్టి హామీ రాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Follow Us