Wisdom Bird: రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం!

ఇదో అరుదైన ఘటన. విజ్డమ్‌ అనే పక్షి 74 ఏళ్ల వయసులో గుడ్డు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పక్షి జీవితకాలం 68 ఏళ్లు. ఈ వయసు వరకు బతికి ఉండటమే కాకుండా.. ఎంతో ఆరోగ్యంగా గుడ్డు పెట్టడం అసాధారణ విషయం అని శాస్త్రవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు.

author-image
By Seetha Ram
New Update
Wisdom bird

Wisdom bird Photograph: (Wisdom bird)

యానిమల్స్‌కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. లక్షల్లో వ్యూస్, వేలల్లో షేర్స్, వందల్లో కామెంట్స్‌తో తెగ ట్రెండ్ అవుతుంటాయి.

అది మాత్రమే కాకుండా కొన్ని యానిమల్స్ రికార్డులు సైతం బ్రేక్ చేస్తాయి. ఊహించని విధంగా నెటిజన్లను మంత్రముగ్దులను చేసి అట్రాక్ట్ చేస్తాయి.

Also Read : ఆసియా కప్ మనదే.. దుమ్ము దులిపేసిన టీమిండియా మహిళా క్రికెటర్లు

తాజాగా అలాంటిదే జరిగింది. ఓ పక్షి ఏకంగా రెండు రికార్డులను సృష్టించింది. ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

లేసాన్ అల్బట్రాస్

లేసాన్ అల్బట్రాస్.. ఇది సముద్రాలపై ఎగిరే ఒక జాతి పక్షి. లేసాన్ అల్బట్రాస్‌కు శాస్త్రవేత్తలు విజ్డమ్ అని పేరు పెట్టారు. దీని వయసు చాలా ఎక్కువ. ఈ పక్షులు దాదాపు 68 ఏళ్ల వరకు జీవిస్తాయి. 

ఈ విజ్‌డమ్ పక్షికి 5ఏళ్ల వయసు ఉన్నపుడు 1956లో అమెరికా జియోలాజికల్ సర్వే ఆఫీసర్లు తొలిసారి కనుగొన్నారు. అప్పుడు దీని గుర్తింపు కోసం కాలికి జెడ్ 333 నెంబర్ గల ట్యాగ్‌ను తగిలించారు.

ఇక ఈ పక్షి తన జీవిత కాలంలో 30 కంటే ఎక్కువ పిల్లలను పొదిగినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది చివరిసారిగా 2021లో గుడ్డు పొదిగింది.

జీవితమంతా ఒకే పక్షితో సహజీవనం

ఇదిలా ఉంటే ఈ జాతి పక్షులు జీవితమంతా ఒకే పక్షితో సహజీవనం చేస్తాయి. కానీ విజ్‌డమ్ మాత్రం ఇప్పటి వరకు మూడు కంటే ఎక్కువ మగ పక్షులతో సహజీవనం చేసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

గతంలో విజ్‌డమ్, అకేకామై అనే మగ పక్షితో సహజీవనం చేసింది. పసిఫిక్ సముద్ర ప్రాంతంలో తిరుగుతూ ఉండేవి. కానీ ఓ సారి సముద్రానికి వెళ్లిన అకేకామై తిరిగి వెనక్కి రాలేదు.

రెండు రూల్స్ బ్రేక్

దాంతో చాలా ఏళ్లు ఒంటరిగా ఉన్న విజ్‌డమ్ ఇటీవల కొత్త భాగస్వామితో గడిపింది. దీని ఫలితంగా ఈ ఏడాది గుడ్డు పెట్టింది. దీంతో ఈ పక్షి రెండు రూల్స్ బ్రేక్ చేసి రికార్డులు సృష్టించింది. అందులో ఒకటి దాని జీవిత కాలం.. కాగా మరొకటి లేటు వయసులో గుడ్డు పెట్టడం. 

అవును ఈ పక్షుల జీవితకాలం 68 ఏళ్లే. కానీ ప్రస్తుతం విజ్‌డమ్ వయసు 74 ఏళ్లు. దీని జీవితం కాలం తక్కువే అయినా ఇది ఇంతకాలం జీవంచడం ఆశ్చర్యకరమైన విషయం.

Also Read : జానీ మాస్టర్ కమ్ బ్యాక్.. రామ్ చరణ్ స్టెప్పులతో అదిరిపోయిన డోప్ సాంగ్

అలాగే ఈ వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా గుడ్డు పెట్టడం అసాధారణ విషయం అని శాస్త్రవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు