/rtv/media/media_files/2026/03/22/abdul-basit-2026-03-22-15-05-13.jpg)
Former Pakistan's High Commissioner Abdul Basit
Abdul Basit Threats of Attack on India : పాశ్యాత్య దేశాలు తమను లక్ష్యంగా చేసుకుంటే మేము భారత్‌పై దాడులు చేస్తామంటూ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు తమను టార్గెట్ చేస్తే తాము భారత్‌పై దాడులకు దిగకతప్పదని ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. భారత్ లో ముఖ్య నగరాలైన ముంబై, న్యూఢిల్లీ లాంటి నగరాలపై మరో ఆలోచన లేకుండా దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది అప్పుడు తేల్చుకుంటామని ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
Former Pakistani High Commissioner to India Abdul Basit thinks if USA or any other country attacks Pakistan then Pakistan should attack India and we will see what happens after that.
— Incognito (@Incognito_qfs) March 21, 2026
Pakistan's existence is a threat to India. Everyone in Pakistan is a Jihadi. Anyone who doesn't… pic.twitter.com/5fmhhFx9S9
పాశ్చాత్య దేశాలు తమపై దాడులు చేసిన క్రమంలో పాక్‌కు మరో దారిలేకపోతే జరిగేది ఇదేనని అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించాడు. అయితే, ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలు చాలా తక్కువని, దాదాపు అసాధ్యమని కూడా వివరణ ఇవ్వడం గమనార్హం. ‘మాకు హాని తలపెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే భారత్‌పై దాడి చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటివి జరగాలని భారత్‌తో పాటు తామూ కోరుకోవట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే బాసిత్ నేరుగా న్యూఢిల్లీ, ముంబై నగరాలను ప్రస్తావించడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
పాశ్చాత్య దేశాల దాడిని నేరుగా ఎదుర్కునే సత్తా పాక్ వద్ద లేదనే అంశాన్ని బాసిత్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయని భారత రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. పాశ్చాత్య దేశాలపై పాక్ ప్రతీకార దాడులు చేయడం చేతకానప్పుడు చివరిగా భారత్‌ను టార్గెట్ చేయాలన్నది పాక్ వ్యూహంగా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. కాగా ఇప్పటికే పాక్ అణ్వాయుధాలతో తమకు ముప్పు పొంచి ఉందని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి కూడా పాక్ ఒక ధూర్త దేశమని ఇటీవల మండిపడటం గమనార్హం.
కాగా అబ్దుల్ బాసిత్ 2014-17 మధ్య కాలంలో భారత్‌లో పాక్ హైకమిషనర్‌గా పని చేశారు. పాక్ దౌత్యవేత్తగా భారత దేశంలో కీలక బ్యాధతలను నిర్వహించిన వ్యక్తి ఇలాంటి ఉద్రేక పూర్వక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పాక్ ఇటీవల తన పొరుగున ఉన్న అఫ్గానిస్థాన్‌పై పలు వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎందరో అమాయకులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ పాలకులు అయిన తాలిబాన్లు ఆరోపిస్తున్నారు.
Follow Us