US Offer : అమెరికాలో అక్రమంగా ఉంటున్నారా?..రూ. 2లక్షలు తీసుకుని వెళ్లిపోండి.. ట్రంప్ క్రేజీ ఆఫర్!

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లకు ట్రంప్ సర్కార్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఎవరైనా తమ సొంత దేశానికి వెళ్ళిపోవాలని అనుకుంటే, వారికి ఉచితంగా విమానం టికెట్ ఇవ్వడమే కాకుం

New Update
Donald Trump

Donald Trump

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లకు ట్రంప్ సర్కార్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఎవరైనా తమ సొంత దేశానికి వెళ్ళిపోవాలని అనుకుంటే, వారికి ఉచితంగా విమానం టికెట్ ఇవ్వడమే కాకుండా, అదనంగా 2,600 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ. 2,15,000) నగదును బహుమతిగా ఇస్తోంది. మన భారతీయులతో పాటు చైనా, కొలంబియా వంటి దేశాల నుంచి వచ్చి అక్కడ ఉంటున్న వారి కోసం ఈ ఆఫర్ తెచ్చారు. 

ఇంతకు ఈ ఆఫర్ ఎందుకంటే..  దీనిని 'ప్రాజెక్ట్ హోమ్ కమింగ్' అని పిలుస్తారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత గత ఏడాది ఈ ప్లాన్ మొదలుపెట్టారు. పోలీసులు పట్టుకుని బలవంతంగా జైల్లో వేసి పంపించడం కంటే, గౌరవంగా వాళ్లే వెళ్ళిపోయేలా చూడటం దీని ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. ఇప్పటి వరకు దాదాపు 22 లక్షల మంది ఈ అవకాశాన్ని వాడుకుని తమ దేశాలకు వెళ్ళిపోయారు.

CBP Home' యాప్‌ను డౌన్లోడ్

అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారు ఎలా వెళ్ళాలంటే మందుగా తమ ఫోన్‌లో 'CBP Home' అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో తమ వివరాలు ఇచ్చి, "నేను వెళ్ళిపోతాను" అని చెబితే సరిపోతుంది. దీనివల్ల అరెస్టు అవుతామనే భయం ఉండదు. హాయిగా ఒక మామూలు ప్రయాణికుడిలా విమానం ఎక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. తమ ఆఫీసు పనులు, చదువు లాంటివి సెటిల్ చేసుకుని వెళ్ళడానికి ప్రభుత్వం టైమ్ కూడా ఇస్తుంది.

ఒకరిని బలవంతంగా పట్టుకుని పంపించాలంటే అమెరికా ప్రభుత్వానికి దాదాపు రూ. 15 లక్షలు ఖర్చవుతుంది. అదే ఈ ఆఫర్ ద్వారా పంపిస్తే కేవలం రూ. 4 లక్షలే ఖర్చవుతుంది. అంటే ఒక్కో మనిషి మీద ప్రభుత్వానికి దాదాపు రూ. 11 లక్షలు ఆదా అవుతుంది. అందుకే వెళ్ళేటప్పుడు ఆ డబ్బులు చేతిలో పెడుతున్నారు. మొదట్లో తక్కువ డబ్బులు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని సుమారు రూ. 2 లక్షల వరకు పెంచారు.

Advertisment
తాజా కథనాలు