Donald Trump health : విమానం దిగుతూ తడబడిన ట్రంప్..ఆరోగ్యం పై సర్వత్రా చర్చ

ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం..మరోవైపు దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు వెరసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆయన ఆరోగ్యంపై కూడా సందేహలు వ్యక్తమవుతున్నాయి.

New Update
trump

Donald Trump health

Donald Trump health :  ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం..మరోవైపు దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు వెరసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆయన ఆరోగ్యంపై కూడా సందేహలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి దిగుతున్న సమయంలో ట్రంప్‌ నడకతీరును చూసిన వారిలో ఈ సందేహం మొదలైంది. అంతకు ముందు రోజు జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఆయన కుర్చీలో కూర్చునేందుకు కూడా ఇబ్బంది పడిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు వీడియోల్లోనూ ట్రంప్‌ అంతా ఉత్సాహంగా కనిపించలేదు. అంతేకాక ఆయన నడుస్తున్న తీరు, కూర్చుంటున్న తీరు కూడా ఆయన ఆరోగ్యంపై పలు సందేహాలు తలెత్తడానికి కారణమైంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ఉదయం తన అధికారిక ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఫ్లోరిడా చేరుకున్నారు. అక్కడ ఆయన విమానం దిగుతున్న సమయంలో  విమానం రెయిలింగ్ పట్టుకుని జాగ్రత్తగా, నెమ్మదిగా కిందకు దిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. విమానం దిగుతున్న సమయంలో మధ్యలో ఆగుతూ, తడబడుతూ, అడుగులు జాగ్రత్తగా వేస్తూ మెట్లు దిగారు. దీనికి ముందు రోజు శుక్రవారం  జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌ అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చునేందుకు కూడా ఇబ్బంది పడినతీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం..మరోవైపు దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనల మూలంగా ట్రంప్‌ ఒత్తిడికి గురవుతున్నాడని అందుకే ఆయన అనారోగ్యానికి గురయ్యారని ప్రచారం సాగుతోంది. ఆయన తడబడిన రెండు వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి వార్తలు మొదలయ్యాయి.మరోవైపు ఈ రెండు వీడియోలపై కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇదేం పట్టించుకోవలసిన అంశం కాదని అని కొట్టిపడేశారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై పలు సార్లు వచ్చాయి. అయితే ఆ వార్తలను వైట్‌హౌస్ అనేక మార్లు ఖండిస్తూ వచ్చింది. అంతేకాక తను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ట్రంప్ ఇప్పటికే పలుసార్లు ప్రకటించినప్పటికీ ఇంకా ఆయన ఆరోగ్యంపై సందేహాలు వీడటం లేదు.

Advertisment
తాజా కథనాలు