/rtv/media/media_files/2026/03/29/fotojet-16-2026-03-29-11-18-31.jpg)
America seizes Kharg Island
Strait of Hormuz attacks : పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. యుద్ధంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా హోర్ముజ్ జలసంధి సమీపంలో సాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ తరుణంలో అక్కడి ఇరాన్ సైన్యాలపై అమెరికా వైమానిక, నౌకాదళాలు దాడులకు దిగాయి. ఈ క్రమంలో ఇరాన్ పై అమెరికా పై చేయి సాధించింది. ఇరాన్ కు చెందిన ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం అయిన 'ఖార్గ్ ఐలాండ్'ను అమెరికా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా దళాలు.. ఇరాన్‌పై వ్యూహాత్మక దాడులను వేగవంతం చేశాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా కీలక ముందుడుగు వేసింది.
అక్కడి ఇరాన్ సైన్యాలపై దాడులు చేసి ఇరాన్‌కు చెందిన 'ఖార్గ్ ఐలాండ్' (Kharg Island)ను అమెరికా దళాలు తమ స్వాధీనం చేసుకున్నాయి. ఇరాన్ నుంచి సాగే ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుండే జరుగుతాయని తెలుస్తోంది. అమెరికా దీనిని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసినట్లయింది. ఇదిలా ఉండగా రాబోయే కొన్ని వారాల పాటు ఇరాన్ భూభాగంలో భారీ ఎత్తున 'గ్రౌండ్ ఆపరేషన్స్' (భూతల యుద్ధం) (Ground Ops) నిర్వహించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే పశ్చిమాసియా ప్రాంతానికి అదనపు దళాలను తరలిస్తున్నారు.
కాగా, ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతి చేసే హోర్మోజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ గత కొంతకాలంగా హెచ్చరిస్తు్న్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అక్కడ పట్టు సాధించేందుకు అమెరికా నౌకాదళం గత కొంత కాలంగా నిరంతర దాడులు చేస్తూ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఇరాన్ అనుబంధ సంస్థలు గల్ఫ్ దేశాల్లోని చమురు ప్లాంట్లు, అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. వీటికి ప్రతిచర్యగా అమెరికా నేరుగా ఇరాన్ భూభాగంపైనే దాడులకు దిగింది. ఇది అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. అమెరికా చేపట్టబోయే భూతళ యుద్ధం 'గ్రౌండ్ ఆపరేషన్' నిర్ణయం ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసేలా ఉందని పలువురు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శాంతి చర్చల కోసం ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడం అన్ని దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి.
Follow Us