/rtv/media/media_files/2026/01/05/trump-2026-01-05-09-40-09.jpg)
Trump
ఇరాన్, అమెరికా(Iran America Israel War) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ జరిపిన చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగియడంతో యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకుంటున్నాయి. దాదాపు 21 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా తన లాస్ట్ అండ్ బెస్ట్ ప్రపోజల్‌ను ఇరాన్ ముందు ఉంచిందని, నిర్ణయం ఇప్పుడు ఇరాన్ చేతుల్లోనే ఉందని వాన్స్ స్పష్టం చేశారు. - us iran talks
ఇరాన్‌కు 2 వారాల గడువు.. ట్రంప్ ముందున్న 2 ప్లాన్లు..
ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగిస్తే తర్వాత ట్రంప్(47th us president donald trump) ఏం చేస్తాడని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన పోస్ట్‌లను బట్టి చూస్తే, ఇరాన్ విషయంలో ఆయన 'వెనిజులా తరహా' కఠిన వ్యూహాన్ని అనుసరించేలా కనిపిస్తున్నారు. ఇరాన్ ఈ ఒప్పందానికి నిరాకరిస్తే ట్రంప్ ప్రభుత్వం ప్రధానంగా రెండు మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంది. తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఇరాన్ నౌకలను దిగ్బంధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్న ఓ మీడియా కథనాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇరాన్‌పై తదుపరి ప్రణాళికల గురించి ట్రంప్ పరోక్షంగా హింట్ ఇచ్చారా అని అంతర్జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తోంది.
Also Read : అందగత్తెను ఇవ్వకపోతే యుద్ధమే.. టర్కీని బెదిరిస్తున్న ఉగాండా ఆర్మీ చీఫ్!
1. సైనిక చర్య
ఇరాన్‌ను "రాతియుగానికి" పంపేలా ఆ దేశంలోని కీలక స్థావరాలపై భారీస్థాయిలో బాంబు దాడులు చేయడం. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా ధ్వంసం చేసి ఆ దేశ ఎకానమీ బ్యాక్ బోన్ విరచాలని రిటైర్డ్ జనరల్ జాక్ కీన్ వంటి నిపుణులు సూచిస్తున్నారు.
2. నావికా దిగ్బంధనం:
గతంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను లొంగదీసుకోవడానికి అమెరికా అనుసరించిన నావికా దిగ్బంధన వ్యూహాన్ని ఇరాన్ పైనా ప్రయోగించడం. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుని, ఇరాన్ నుండి చమురు ఎగుమతులు జరగకుండా అడ్డుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇరాన్ అమెరికా డిమాండ్లకు లొంగకపోతే అధ్యక్షుడి వద్ద ఉన్న అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే. ఇరాన్ నౌకలను ఉన్న ప్రదేశం నుంచి కదలనీయకుండా చేయడంతో చమురు ఎగుమతులపై ఆధారపడిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంది. టెహ్రాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దాని మిత్ర దేశాలైన చైనా, భారత్‌పైనా ఈ ప్రభావం పడుతుంది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్భందించడానికి ముందు కూడా ఇదే విధంగా ఆ దేశంలోని నౌకలను దిగ్బంధించారు. ఆ విజయవంతమైన ప్లాన్‌ను ట్రంప్ ఇరాన్‌పైనా అమలు చేసే అవకాశం ఉంది’ అని మీడియా సంస్థ అంచనావేసింది. పాకిస్థాన్‌లో ఇరాన్‌తో జరిగిన చర్చలు విఫలమైనట్లు ప్రకటించిన కొన్ని గంటల అనంతరం ట్రంప్ ఈ పోస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించకుంది.
భారత్, చైనాలపై ప్రభావం..
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి నౌకపై అమెరికా నిఘా ఉంచడం సులభమని జాతీయ భద్రతా నిపుణురాలు రెబెక్కా గ్రాంట్ పేర్కొన్నారు. ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు ఇది పెద్ద సవాలుగా మారనుంది. అమెరికా అనుమతి లేకుండా ఏ నౌక బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో, ఈ దేశాలపై ఒత్తిడి పెంచి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం ట్రంప్ లక్ష్యం.
Also Read : చైనాకు ట్రంప్ వార్నింగ్: ఇరాన్‌కు ఆయుధాలిచ్చారో.. ఇక మీ పని ఖతం!
రంగంలోకి దిగిన యుద్ధనౌకలు
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా తన శక్తివంతమైన యుద్ధనౌకలను మోహరించింది. భారీ యుద్ధనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ ఇప్పటికే అక్కడకు చేరుకోగా, దానికి తోడుగా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ కూడా సిద్ధంగా ఉంది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాలన్నదే అమెరికా ప్రధాన డిమాండ్. కాల్పుల విరమణ గడువు ముగియవస్తుండటంతో, ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇరాన్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఒకవేళ ఇరాన్ మెడలు వంచకపోతే, మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధం తప్పదనే సంకేతాలు అందుతున్నాయి.
Follow Us