Social media challenge : బాలిక ప్రాణం తీసిన సోషల్ మీడియా ఛాలెంజ్.. మెడకు తాడు బిగించుకుని

ఈ మధ్య సోషల్‌ మీడియా ఛాలెంజ్‌ల మూలంగా పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి దారుణమే ఆమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. స్నేహితులతో చేసిన ఛాలెంజ్‌లో భాగంగా ఆ బాలిక మెడకు తాడు బిగించుకోవటంతో ఊపిరి ఆడక దుర్మారణం పాలయింది.

New Update
FotoJet (28)

Social media challenge that took the life of a girl

Social media challenge :  ఈ మధ్య సోషల్‌ మీడియా ఛాలెంజ్‌ల మూలంగా పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి దారుణమే ఆమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఛాలెంజ్ ఓ బాలిక ప్రాణాలు తీసింది. స్నేహితులతో చేసిన ఛాలెంజ్‌లో భాగంగా ఆ బాలిక మెడకు తాడు బిగించుకోవటంతో ఊపిరి ఆడక దుర్మారణం పాలయింది.

అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అక్కడి పోలీసులు, బాలిక తల్లిదండ్రులుత తెలిపిన వివరాల ప్రకారం..కర్టీస్, వెండీ బ్లాక్‌వెల్ అనే దంపతులు టెక్సాస్‌లో నివసిస్తున్నారు. వారికి 9 ఏళ్ల కూతురు జాక్‌లిన్ కే బ్లాక్‌వెల్ ఉంది. ఆమె  సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. చిన్న వయసు నుంచే రీల్స్, షార్ట్స్ చూస్తుండేది.  ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం బ్లాక్‌వెల్ సోషల్ మీడియాలో ‘బ్లాక్ అవుట్’ ఛాలెంజ్ అనే వీడియోను చూసింది. తను చూడడమే కాకుండా తన అమ్మమ్మకు కూడా చూపించింది. అయితే ఆ వీడియోను చూసిన ఆ పెద్దావిడ తీవ్రంగా బయపడింది. అంతేకాక అలాంటి వాటికి జోలికి వెళ్లద్దు అంటూ పాపను హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 3న ఉదయం జాక్‌లిన్ ఆడుకోవటానికి అని చెప్పి ఇంటి వెనకాల ఉన్న ఖాళీ  స్థలంలోకి వెళ్లింది. అయితే అలా వెళ్లిన పాప ఎంత సేపటికి ఇంటిలోకి తిరిగిరాకపోవటంతో ఆమె కోసం తల్లి అక్కడికి వెళ్లింది. అమె అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ సమయంలో  జాక్‌లిన్ తన గొంతుకు తాడు బిగించుకుని పడిపోయి ఉండడాన్ని గమనించింది.వెంటనే ఆమె పరుగెత్తుకుంటూ  బాలిక దగ్గరకు వెళ్లింది. మెడకు ఉన్న తాడును తీసిపడేసి చలనం లేకుండా పడిఉన్న కూతురిని రక్షించుకోవాలనే తాపత్రంతో  సీపీఆర్ కూడా చేసింది. అయినా లాభం లేకపోవడంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్‌ చేసింది.

హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది.  అయితు అక్కడి వైద్యులు జాక్‌లిన్‌ను పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ విషయమై జాక్‌‌లిన్ తల్లి కర్టీస్ మాట్లాడుతూ.. ‘నేను చాలా భయపడిపోయాను. నేనెప్పుడూ అంత షాకింగ్ సన్నివేశం చూడలేదు. నా కూతురిని అలాంటి పరిస్థితిలో చూస్తాను అనుకోలేదు. తనను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ, లాభం లేకుండా పోయింది. మీరు కూడా మీ  పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచండి. సోషల్ మీడియా అల్గారిథమ్ చాలా దారుణంగా పని చేస్తుందని ఆమె హెచ్చరించారు. వాటిని అలా తయారు చేశారని, పసి పిల్లల ప్రాణాలు పోవడానికి కారణం ముమ్మాటికీ ఆ కంపెనీలే’ అంటూ ఆవేదన వ్యక్తం చేయడం పలువురిని కంటతడి పెట్టించింది.

Advertisment
తాజా కథనాలు