/rtv/media/media_files/2026/03/29/no-kings-2026-03-29-06-48-28.jpg)
No Kings Movement
No Kings Movement : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలనను, ఆయన అనుసరిస్తున్న విధనాలను వ్యతిరేకిస్తూ అమెరికావ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆయన నిరంకుశ చర్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు "నో కింగ్స్' పేరుతో నిరసనలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా సుమారు 3,100 చోట్ల 50 రాష్ట్రాల్లోఈ నిరసనలు కొనసాగాయి. ట్రంప్‌నుద్దేశించి ఈ నిరసనల్లో ‘రాజులు వద్దు’ అని రాసిన ప్లకార్డులను పట్టుకుని నిరసనకారులు ఆందోళనలకు దిగారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా నిలవనుంది. దీనికి మిన్నెసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు శనివారం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న నిరంకుశ పోకడలు, విధానాలకు వ్యతిరేకంగా 2025-2026లో అమెరికాలో జరిగిన భారీ నిరసన ఉద్యమం ఇది.
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది దాటింది. ఆయన అధికారం చేపట్టిన నాటి నుంచి యుద్ధాలు తప్ప దేశం కోసం చేసిన మంచి పని లేదని నిరసన కారులు అంటున్నారు. బహుశా ఈ ఏడాది కాలంలో తాజాగా జరిగిన నిరసన అతిపెద్ద నిరసన కార్యక్రమమని నిర్వాహకులు తెలిపారు. ట్రంప్ ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని ముగించాలని ఈ సందర్భంగా నిరసనకారులు డిమాండ్ చేశారు. ట్రంప్ అనుసరిస్తున్న వలసలు, విదేశాంగ విధానాన్ని నిరసనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా ఈ ఆందోళన కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని వారు తెలిపారు. ‘‘లాభాల కోసం యుద్ధమా? మా సైనికులు అమ్మకానికి లేరు. అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యమవుతుంది’’ అంటూ ఆందోళన కారులు నినాదాలు చేశారు.
కాగా, ఈ సందర్శంగా నిరసన కారులు మాట్లాడుతూ ‘ట్రంప్ మమ్మల్ని ఒక నిరంకుశుడిలా పాలించాలనుకుంటున్నారు. కానీ ఇది యునైట్ స్టేట్స్. అధికారం ప్రజల చేతిలో ఉంది. రాజులు కావాలని ఆశించే వారి చేతిలోగానీ లేదా వారి బిలియనీర్ మిత్రుల చేతిలో గానీ కాదు’ అని స్ఫష్టం చేశారు. కాగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో ఇది మూడవ నిరసన కార్యక్రమం. ఈ ఆందోళనల్ని ప్రగతిశీల కూటముల నెట్‌వర్క్ సమయన్వయం చేస్తోంది. మూవ్‌ఆన్, ఇండివిజిముల్, 50501 వంటి నేషనల్ సంస్థలు నాయకత్వం వహిస్తున్నాయి. కాగా అమెరికాతో పాటు లండన్, పారిస్, కెనడా, టోక్యో వంటి నగరాల్లోనూ సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. "ప్రజాస్వామ్యం కావాలి, రాచరికం కాదు" (Democracy not Monarchy), "నియంతలు వద్దు" (No Tyrants) వంటి ప్లకార్డులతో నిరసనకారులు నినదించారు. ఈ ఉద్యమం, ట్రంప్ పరిపాలనా విధానాల పట్ల అమెరికన్ సమాజంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై ఉన్న ఆందోళనకు అద్దం పడుతోంది. ఈ నిరసనలను శ్వేతసౌధం కొట్టి పారేసింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంది.
Follow Us