Iran closes Hormuz Strait : హార్మూజ్‌లోకి నో ఎంట్రీ.. తిరుగు ప్రయాణమైన నౌకలు

ఇరాన్‌, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న సీజ్‌ఫైర్‌ ఒప్పందం కుదరడంతో హార్మూజ్‌ను తెరిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని గంటల్లోనే ఇరాన్ తిరిగి హార్మూజ్‌ను మూసివేసింది

New Update
FotoJet (8)

Iran closes Hormuz Strait

Iran closes Hormuz Strait : ఇరాన్‌, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న అమెరికా, ఇజ్రాయెల్‌తో సీజ్‌ఫైర్‌ ఒప్పందం కుదరడంతో హార్మూజ్‌ సంధిని తెరిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని గంటల్లోనే తిరిగి హార్మూజ్‌ను మూసివేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. దీంతో హార్మూజ్‌ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీజ్‌ ఫైర్‌ ప్రకటనతో హార్మూజ్‌ వైపు క్యూ కట్టిన అనేక సరుకు రవాణా నౌకలు తిరిగి వెనక్కు మళ్లుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 అయితే అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ కుదిరినప్పటికీ   లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను కొనసాగిస్తుండటంతో గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. లెబనాన్‌పై దాడులకు నిరసనగా ఇరాన్ మళ్లీ హార్మూజ్‌ను మూసివేసినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సరకు రవాణా నౌకల రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది.  ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

ఆ మీడియా కథనాల ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్‌ ఫైర్‌) కుదిరాక గ్రీస్, లైబీరియాలకు చెందిన రెండు నౌకలు  సురక్షితంగా హార్మూజ్‌ను దాటగలిగాయి. ఆ తరువాత లెబనాన్‌ పై ఇజ్రాయెల్‌ దాడులతో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో అరోరా అనే నౌక ప్రయాణానికి బ్రేక్ పడింది. హార్మూజ్‌ జలసంధిని దాటేందుకు ముందుకెళ్లిన నౌక ముసందం తీరం వద్ద వెనక్కు మళ్లినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం గమనార్హం.

ఇవే కాక చైనాకు చెందిన కొన్ని సరకు రవాణా నౌకలు కూడా హార్మూజ్‌ను దాటేందుకు వేచి చూస్తున్నట్టు కూడా మీడియా వెల్లడించింది. చైనా ప్రభుత్వ షిప్పింగ్ సంస్థ కాస్కో‌తో పాటు మరో సంస్థ హీ రాంగ్ హాయ్‌కు చెందిన నౌకలు హార్మూజ్‌ జలసంధికి కొద్ది దూరంలో పర్షియన్ గల్ఫ్ జలాల్లో వేచి చూస్తున్నట్టు మీడియా సమాచారం. అయితే ఇవి జలసంధిని దాటాయా? లేదా? అనేది ఇంకా తెలియలేదు.

#lebanon #israeli attacks on lebanon #hormuz strait #hormuz strait open #hormuz strait closed again #hormuz strait news
Advertisment
తాజా కథనాలు