Crime News: స్కూల్లో మంటలు.. 17 మంది చిన్నారులు సజీవదహనం

నైజీరియా జంఫారాలోని ఓ ఇస్లామిక్ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. స్కూల్ పక్కనే ఉన్న కర్రలకు మంటలు అంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికి స్కూల్లో 100 మంది విద్యార్థులున్నారు.

New Update
Nigeria Zamfara school fire 17 students killed

Nigeria Zamfara school fire 17 students killed

వాయువ్య నైజీరియాలోని ఓ ఇస్లామిక్ స్కూల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జంఫారా రాష్ట్రంలోని కౌరా నమోడా జిల్లాలో ఇస్లామిక్ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే స్కూల్ పక్కనే నిల్వ ఉన్న కర్రలకు మంటలు అంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 

మరో 17 మందికి గాయాలు

కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. కానీ ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. పాఠశాల పక్కనే ఉన్న కర్రలకు మంటలు అంటుకుని ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాద సమయంలో స్కూల్లో అప్పటికి 100 చిన్నారులు ఉన్నారు. అందులో మరో పదిహేడు మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read :  కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

Also Read :  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

నైజీరియా అధ్యక్షుడు సంతాపం

ఈ అగ్ని ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పాఠశాలలకు విజ్ఞప్తి చేశారు. కాగా గత నెలలో నైజీరియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. నైజీరియా రాజధాని అబుజా శివార్లలోని ఒక పాఠశాలలో ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం పేలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇప్పుడు మళ్లీ అగ్ని ప్రమాదం కారణంగా స్కూల్‌లో చిన్నారులు మరణించడం ఆందోళనకరంగా మారింది. 

Also Read :  TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు