Trump Effect: ట్రంప్‌ ఆఫర్‌ ఎఫెక్ట్‌.. ఏకంగా 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్‌ సర్కారు వ్యూహం మెల్లగా ఫలిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా (America) లో ప్రభుత్వ ఉద్యోగాల (Government Employees) కోత విషయంలో ట్రంప్‌ సర్కారు వ్యూహం మెల్లగా ఫలిస్తున్నట్లు తెలుస్తుంది. గురువారంతో ది ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన బై అవుట్‌ ఆఫర్‌ గడువు ముగియనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది.

Also Read: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!

ఈ విషయాన్ని ఓపీఎం ధ్రువీకరించింది. కాకపోతే ట్రంప్‌ (Donald Trump) కార్యవర్గం ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా చిన్నది.ఇది భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని వెల్లడించింది. బై అవుట్‌ ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఒక మెమో వెలువడింది.

Also Read: Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!

పనిచేయకుండానే జీతం...

ఈ మేరకు ఒక ఈమెయిల్‌ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది.స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు.ఫిబ్రవరి 6 వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని అందులో వెల్లడించారు.దీనిని ఎంచుకొన్న వారికి సెప్టెంబర్‌ వరకు పనిచేయకుండానే జీతం పొందొచ్చని చెబుతున్నా,దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

సుమారు 10-15 శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం భావించింది.ఇది విజయవంతంగా అమలైలతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్‌ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓ వైపు ఫెడరల్‌ నిధులు, రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు,నాన్‌ ప్రాఫిట్ సంస్థల పై దీని ప్రభావం ఉండనుంది. 

Also Read:ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

Also Read: బంగారు ప్రియులకు బిగ్ షాక్.. ఆల్ టైం గరిష్టానికి చేరిన పసిడి.. గ్రాము రేటు ఎంతంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు