ఇరాన్‌పై దాడుల కోసం ఇండియాలో అమెరికా ఆర్మీ బేస్.. కేంద్రం క్లారిటీ

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలోకి ఇండియా ఎంట్రీ ఇస్తోందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్తపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

New Update
LEMOA agreement

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలోకి ఇండియా ఎంట్రీ ఇస్తోందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్తపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో యుద్ధం కోసం అమెరికా భారత్ నుంచి సైనిక మద్దతు కోరిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తిగా కొట్టిపారేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇవన్నీ "అవాస్తవం, నిరాధారం" అని స్పష్టం చేసింది.

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు జరుపుతుంది. ఇదిలా ఉండగా టెహ్రాన్‌పై దాడులకు భారత భూభాగాన్ని యుఎస్‌ఏ వాడుకోనుందని LEMOA ఒప్పందాన్ని అనుసరించి కొంకణ్ తీరంలో అమెరికా తన స్థావరాలను ఏర్పాటు చేయనుందని కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదు. అవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి ప్రకటనలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని  భారత విదేశాంగ శాఖ అధికారిక ఖాతాలో పేర్కొంది

అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారని, పశ్చిమాసియాలో మోహరించడానికి భారత సైన్యాన్ని పంపాలని కోరారనే వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత్ కూడా ఈ పోరులో భాగస్వామి కాబోతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి.

విదేశాంగ శాఖ వివరణ

ఈ అంశంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. అటువంటి ప్రతిపాదనలు ఏవీ అమెరికా నుంచి రాలేదని, భారత్ కూడా అటువంటి ఆలోచన చేయడం లేదని తేల్చిచెప్పారు. "భారత సైన్యం పశ్చిమాసియా సంఘర్షణలో పాల్గొనబోతోందనే వార్తలు కేవలం కల్పితం. ఇవి బాధ్యతారహితమైన ప్రచారాలు" అని ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ శాంతిని కాంక్షిస్తుందని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలని నమ్ముతుందని పునరుద్ఘాటించారు.

భారత్ వైఖరి ఇదే..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్.. ఈ రెండు దేశాలతోనూ భారత్‌కు మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత భారత్‌కు అత్యంత ముఖ్యం. యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, పరిస్థితి సద్దుమణగాలని భారత్ కోరుకుంటోంది.

ప్రజలకు విజ్ఞప్తి

సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలను కోరింది. సున్నితమైన అంతర్జాతీయ అంశాలపై అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దేశ భద్రత మరియు సైనిక వ్యూహాలకు సంబంధించిన తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వల్ల అనవసర భయాందోళనలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతానికి హర్మూజ్ జలసంధి లేదా ఇతర ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయ నౌకలు, పౌరుల భద్రతపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోంది.

Advertisment
తాజా కథనాలు