Mojtaba Khamenei : ఇరాన్ సుప్రీం ముజ్తబా ఖమేని బతికే ఉన్నాడా? ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి?

ముజ్తబా ఖమేని అయతుల్లా అలీ ఖమేని రెండో కొడుకు తండ్రి మరణాంతరం సుప్రీంలీడర్ పగ్గాలు చేపట్టిన ముజ్తబా ఆచూకీ ప్రస్తుతం అయోమయంగా ఉంది. బతికే ఉన్నాడని ఓవైపు...తండ్రితోపాటే ముజ్తాబా చనిపోయాడని మరోవైపు...ఖమేని ఉనికిపై ఇరుదేశాల వీడియోలతో వార్తల వార్‌ జరుగుతోంది.

New Update
Iran's new leader Mojtaba Khamenei secretly flown to Russia for surgery, says report

Mojtaba Khamenei

ఫిబ్రవరి 28న దాడి జరిగినప్పటినుంచి...ఈ క్షణం వరకూ ముజ్తబా బహిరంగంగా కనిపించలేదు.ముజ్తాబా ఆరోగ్యంపై అనేక అనుమానాలు తెరపైకి వచ్చిన ఈవేళ...ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును చంపేదాకా...తమ పోరాటం ఆగదని ఇరాన్‌ వార్నింగ్‌ ఇస్తోంది.మరోవైపు ముజ్తాబా ఖమేని ఇప్పటికీ బతికిఉంటే...ఎక్కడున్నా సరే లేపేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరిస్తోంది.మా సుప్రీం లీడర్‌కు ఏం కాలేదు..ఆయన ప్రస్తుతం రహస్య ప్రదేశంలో సురక్షితంగానే ఉన్నారు...ముజ్తబా ఖమేనికి ఏ ప్రమాదం జరగలేదు...మా లీడర్‌పై వస్తున్న వార్తలన్నీ తప్పు...ప్రత్యర్థులు నేలకరిచేవరకూ మా పోరాటం ఆగదు...ఇదీ ఇరాన్ విదేశాంగశాఖ చేసిన ప్రకటన...
అయితే ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో...ముజ్తబా ఖమేని ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని...ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని....రష్యాలో ట్రీట్మెంట్‌ పొందుతున్నారని...కువైట్‌కు చెందిన ఓ ప్రధాన వార్తాపత్రిక చెప్పుకొస్తోంది.అంతేకాదు విషమ పరిస్థితుల్లో ఉన్న ఆయననుమార్చి 12న రష్యా సైనిక విమానంలో...టెహ్రాన్‌ నుంచి మాస్కోకు తరలించారని తెలిపింది. రష్యా అధ్యక్షుడు స్వయంగా ఆహ్వానించడంతోనే...ముజ్తబా ఖమేనిని అక్కడకు తీసుకెళ్లారని...పుతిన్‌ నివాసంలోనే మెరుగైన చికిత్స అందుతోందని... కువైట్ మీడియా అల్ జరీదా చెబుతోంది.గాయపడ్డ మొజ్తబా కాలికి విజయవంతంగా సర్జరీ పూర్తయిందని...ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు వార్త ప్రచురించింది.

అయితే కువైట్‌ మీడియా కథనాలను ఇరాన్‌ ఖండించింది.రష్యాలోని ఇరాన్ రాయబారి జలాలీ దీనిపై మాట్లాడారు. మొజ్తబా ఆరోగ్యంగానే ఉన్నారని...ఇరానేలోనే క్షేమంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో ఇరానీయులకు ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.ముజ్తబా ఖమేని ఆచూకీ తెలిపితే10 మిలియన్ డాలర్లు...అంటే ఇండియా కరెన్సీలో సుమారు 93కోట్లు బహుమానం ఇస్తామని వెల్లడించారు. ఇదిలాఉంటే ముజ్తబా ఖమేని తండ్రి అలీఖమేని బతికే ఉన్నట్టు సోషల్‌మీడియాలో ఓవైపు వార్తలు చక్కర్లు కొట్టడం...అమెరికా-ఇజ్రాయెల్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది.ఆయన మరణించారని స్వయంగా ఇరానే ప్రకటించాక...ఇప్పుడు మళ్లీ అలీ ఖమేని బతికుండటం ఏంటి..?

ప్రస్తుతం అలీ ఖమేని మాట్లాడుతున్న వైరల్ వీడియోలు చూస్తే...ఎవ్వరికైనా ఈ డౌట్ రావడం మానదు...వాస్తవానికి అలీఖమేని చివరి ప్రసంగ తేదీ 2026, ఫిబ్రవరి 17.అయితే ఇస్లామిక్ విప్లవ వార్షికోత్సవంలో...అలీ ఖమేని మాట్లాడిన కొన్ని వీడియోలను...ఆయన మరణాంతరం మళ్లీ షేర్ చేయడంతో గందరగోళం తలెత్తింది...అలాగే సాక్షాత్తూ ఇరాన్‌ మీడియా ...ఖమేని తిరిగి వచ్చారన్న ఏఐ వీడియోలను షేర్ చేయడం...యావత్ ప్రపంచ మీడియాని అవాక్కయ్యేలా చేసింది.

మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారని...తమ మిస్సైళ్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ చెప్పుకొచ్చింది.అయితే ఈ వార్తలను పూర్తిగా ఖండించిన ఇజ్రాయెల్‌...ప్రధాని నెతన్యాహు వీడియోలను షేర్ చేసింది.మార్చి 17, 2026న నెతన్యాహు...ఓ అవుట్‌డోర్ కేఫ్‌లో ప్రజలను నేరుగా కలిసి ముచ్చటించిన వీడియో...ఇప్పుడు నెట్టింట వైరల్ అవడంతో ఆయన బతికే ఉన్నారన్న క్లారిటీ ఉంది.ఇరాన్ క్షిపణి దాడుల్లో నెతన్యాహు మరణించిన వార్తలో నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ నిర్థారించింది. ఈ క్రమంలో ఇరాన్‌ IRGC బహరింగ ప్రకటన చేసింది....నెతన్యాహు బతికుంటే వెంటాడి వేటాడి మరీ చంపేస్తామని ప్రకటించడంతో...శత్రుదేశంపై మూడువారాల యుద్ధ ప్రణాళిక రచించిమరీ...ఇజ్రాయెల్‌ నిరంతరం దాడులు చేస్తూనే ఉంది.

Advertisment
తాజా కథనాలు