Missile City : ఇరాన్‌ భూగర్భంలో ‘క్షిపణి నగరం’...పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ల ఆర్మీ..

మెరికా, ఇజ్రాయెల్‌ దాడితో తీవ్రంగా నష్టం వాటిల్లుతున్న ఏ మాత్రం వెనుకడుగు వేయని ఇరాన్‌ తన శక్తినంత ప్రదర్శించి అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌ సైన్యం సంచలన వీడియో విడుదల చేసింది. తమ వద్ద ఉన్న డ్రోన్ల ఆర్మీని తాజాగా ఇరాన్ బయటపెట్టింది.

New Update
FotoJet (14)

Iran's underground 'missile city'

Missile City : అమెరికా, ఇజ్రాయెల్‌ దాడితో తీవ్రంగా నష్టం వాటిల్లుతున్న ఏ మాత్రం వెనుకడుగు వేయని ఇరాన్‌ తన శక్తినంత ప్రదర్శించి అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. హర్మూజ్‌ జలసంధి మీదుగా రాకపోకలు స్తంభించి పోవడంతో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. గల్ఫ్‌ నుంచి ఇతర దేశాలకు చమురు, గ్యాస్‌ సరఫరా చేసే ట్యాంకర్లను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో ఎక్కడి బోట్లు అక్కడే నిలిచిపోయాయి. హర్మూజ్‌ జలసంధిలో నౌకలను టార్గెట్‌ చేడయంతో ఆయా దేశాలకు సరఫరా చేసే చమురు, గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. కాగా ఆయా నౌకలను అడ్డుకోవడం కోసం ఇరాన్‌ పెద్ద ఎత్తున సూసైడ్ డ్రోన్లను, బోట్లను వినియోగిస్తోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో పెద్ద ఎత్తున ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. హర్మూజ్‌ జలసంధిలో పేలుడు పదార్థాలతో కూడిన మానవరహిత బోట్లను వదిలుతుంది. అవి వేగంగా వచ్చి ఇంధన నౌకలను ఢికొట్టి పేల్చి వేస్తున్నాయి. దీంతో అవి తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌ సైన్యం సంచలన వీడియో విడుదల చేసింది. తమ వద్ద ఉన్న డ్రోన్ల ఆర్మీని తాజాగా ఇరాన్ బయటపెట్టింది.

ఈ వీడియోలో తమ వద్ద పెద్ద మొత్తంలో ఆత్మాహుతి డ్రోన్ బోట్‌లు ఉన్నాయని ఇరాన్ సైన్యం ప్రకటించడం గమనార్హం. కాగా ఇరాన్‌ ‘క్షిపణి నగరం’గా చెప్పుకునే భూగర్భ సిటీలో ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇరాన్ అధికారిక టెలివిజన్  విడుదల చేయడం గమనార్హం. కాగా ఈ వీడియోలో నేవీ డ్రోన్‌లు, యాంటీ-షిప్ క్షిపణులు, సీమైన్స్‌తో ఉన్న పొడవైన సొరంగాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఫుటేజ్‌లు ఆయుధాలను ప్రయోగిస్తున్నట్లు చూపించారు. అయితే ఈ వీడియోలను ఎప్పుడు రికార్డ్ చేశారు? అమెరికా లేదా ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రదేశాన్ని కనుగొన్నాయా? అనే దానిపై స్పష్టత లేదు. పొడవాటి భూగర్భ బంకర్‌లో పెద్దసంఖ్యలో సూసైడ్‌ డ్రోన్‌ బోట్లు ఒకదాని వెంట మరొకటి ఉన్న వీడియోతో ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఛానల్‌ ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. కాగా  ట్రైలర్‌పై సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఫోటో కింద అమర్చిన మెటీరియల్ నేవీ డ్రోన్ ఉన్న సొరంగాన్ని చూపిస్తుంది.
 
నేవల్‌ డ్రోన్ల ప్రత్యేకత ఏంటంటే?

ఈ నేవల్‌ డ్రోన్లను అన్‌ మ్యాన్‌డ్‌ సర్ఫేస్‌ వెహికల్స్‌(యూఎస్‌వీ) అని కూడా పిలుస్తుంటారు. ఇవి చూడడానికి చాలా చిన్నసైజులో  ఉంటాయి. యూఎస్‌వీలు సముద్ర జల ఉపరితలంపై లేదా కొద్దిగా సముద్ర జలాల కింద ప్రయాణించే సామార్థ్యం కలిగి ఉంటాయి. వీటిలో పేలుడు పదార్థాలు నింపుతారు. ఈ బోట్లు శత్రు లక్ష్యాన్ని చేరుకోగానే పేలిపోతాయి. నేవల్‌ డ్రోన్లతోనే ఇటీవల పర్షియన్‌ గల్ఫ్‌లో రెండు ఆయిల్‌ ట్యాంకర్లను ఇరాన్‌ పేల్చి వేసింది. హర్మూజ్‌ మీదుగా వెళ్లే ఆయిల్‌ ట్యాంకర్లు, నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి నేవల్‌ డ్రోన్లను ఇరాన్‌ విరివిగా వినియోగిస్తోంది.

 ఇరాన్‌ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ట్యాంకర్ వైపు దూసుకుపోతున్న ఒక చిన్న, స్పీడ్‌బోట్ కనిపిస్తోంది. అది ట్యాంకర్‌ను ఢీకొట్టి, గాలిలోకి దట్టమైన పొగను విడుదల చేసి పెద్ద పేలుడుకు కారణమైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ కు చెందిన చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ రెండుసార్లు దాడులు చేయగా కనీసం రెండుసార్లు నేవీ డ్రోన్‌లను ఉపయోగించిందని అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు