Trump : ఇరాన్‌ సుప్రీం లీడర్ ఇక లేరు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖ‌మేనీ మరణించారని, ఇరాన్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతుందని వ్యాఖ్యానించారు.

New Update
donald trump

Iran's Supreme Leader is no more.. Trump's sensational comments

Trump : ఇరాన్‌తో  అమెరికా, ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖ‌మేనీ మరణించారని, ఇరాన్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతుందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన నాయకత్వ సంక్షోభంలో ఉందని ట్రంప్‌ అన్నారు.  ప్రస్తుతం ఆ దేశంలో పనిచేసే నాయకత్వమే లేకుండా పోయిందని ట్రంప్‌ పేర్కొనడంతో తీవ్ర కలకలం రేపింది. అమెరికా సైనిక దాడుల మూలంగా  ఇరాన్ ఉన్నత స్థాయి కమాండ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందన్నారు, ఇది ఆ దేశ నాయకత్వంపై తీవ్ర అనిశ్చితిని సృష్టించిందని ట్రంప్ అన్నారు. అక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.

మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ ప్రయారిటీ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించిన ట్రంప్, ఇరాన్‌పై యుద్ధం, అమెరికా సైనిక చర్యల ప్రభావం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఇరాన్ నాయకత్వం, సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేశామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ దేశంలో "వారి నాయకులంతా చనిపోయారు... వారి సుప్రీం లీడర్ ఇక సుప్రీం కాదు. ఆయన చనిపోయారు" అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికా చేపట్టిన ఆపరేషన్లతో ఇరాన్ సైనిక సామర్థ్యాలను అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా నిర్వీర్యం చేశామని ట్రంప్ చెప్పారు. ఇరాన్ సైనిక శక్తిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. "ఇరాన్ నౌకాదళం ఇప్పుడు లేదు. అదంతా గల్ఫ్ సముద్రంలో మునిగిపోయింది. వారి వైమానిక దళం పూర్తిగా, సంపూర్ణంగా మరణించింది. వారి విమాన విధ్వంసక, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమైపోయాయి" అంటూ ట్రంప్‌ పేర్కొనడం గమనార్హం.

అంతేగాక‌ ఇరాన్ ఆయుధ సంపత్తిని కూడా లక్ష్యంగా చేసుకున్నామని ట్రంప్ వివరించారు. "ఎవరూ ఊహించని స్థాయిలో ఇరాన్ ఆయుధ నిల్వలను మేము ధ్వంసం చేయగలిగాం. వారి క్షిపణులు, డ్రోన్ ఫ్యాక్టరీలను నాశనం చేశాం. వారి రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని ఏమీ లేకుండా చేస్తున్నాం" అని ఆయన వివరించారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్ ప్రస్తుత పరిస్థితిపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ మొదలైంది. నిజంగానే ట్రంప్ చెప్పినట్లు ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ మృతి చెందాడా అనే విషయంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.

Advertisment
తాజా కథనాలు