క్షిపణులతో దద్దరిల్లిన జెరూసలేం.. రంజాన్ వేళ మసీదుపై దాడి

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఈద్ అల్-ఫితర్ (రంజాన్) పండుగ రోజే జెరూసలేం నగరం క్షిపణి దాడులతో దద్దరిల్లింది. ఇరాన్ ప్రయోగించిన ఓ బాలిస్టిక్ క్షిపణి, ఇస్లాం మతంలో మూడవ అత్యంత పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదుకు దగ్గర కుప్పకూలింది.

New Update
_Missile Hits Jerusalem

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఈద్ అల్-ఫితర్ (రంజాన్) పండుగ రోజే జెరూసలేం నగరం క్షిపణి దాడులతో దద్దరిల్లింది. ఇరాన్ ప్రయోగించిన ఓ బాలిస్టిక్ క్షిపణి, ఇస్లాం మతంలో మూడవ అత్యంత పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదుకు దగ్గర కుప్పకూలింది. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం (మార్చి 20, 2026) ఉదయం జెరూసలేం పాత నగరంలోని ముస్లింలు పండుగ ప్రార్థనలకు సిద్ధమవుతుండగా, ఒక్కసారిగా సైరన్లు మోగాయి. ఇరాన్ వరుసగా ప్రయోగిస్తున్న క్షిపణులలో ఒకటి ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని వచ్చి మసీదు కాంప్లెక్స్ సమీపంలోని యూదు క్వార్టర్‌లో పడింది. క్షిపణి పడిన ధాటికి భారీ శబ్దం రావడమే కాకుండా, శిథిలాలు సమీపంలోని ఇళ్లకు, వాహనాలకు తగిలి నష్టం వాటిల్లింది.

తృటిలో తప్పిన పెను ప్రమాదం

నివేదికల ప్రకారం, ఈ క్షిపణి అల్-అక్సా మసీదు, పశ్చిమ గోడకు సమీపంలో పడింది. ఒకవేళ ఇది నేరుగా మసీదుపై పడి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం కారణంగా ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రభుత్వం అల్-అక్సా మసీదును మూసివేసి, ప్రార్థనలకు ఆంక్షలు విధించింది. దీంతో వేలాది మంది ప్రజలు వీధుల్లోనే ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు, కానీ ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. "ముస్లింల పండుగ రోజే పవిత్ర స్థలాలను లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ పాలకుల పిచ్చికి నిదర్శనం. ఇది ఇరాన్ ఇచ్చిన 'ఈద్ బహుమతి'" అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడింది. మూడు మతాలకు (ముస్లిం, క్రైస్తవ, యూదు) అత్యంత పవిత్రమైన ప్రాంతంలో క్షిపణి పడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

పెరుగుతున్న యుద్ధం

ఫిబ్రవరి 2026 నుండి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ప్రత్యక్ష యుద్ధం ఈ ఘటనతో మరింత ముదిరింది. ఇరాన్ కేవలం సైనిక స్థావరాలనే కాకుండా, జెరూసలేం వంటి మతపరమైన ప్రాధాన్యత ఉన్న నగరాలను కూడా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు