/rtv/media/media_files/2026/03/25/iran-warns-2026-03-25-20-50-48.jpg)
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. శాంతి చర్చలంటూనే ట్రంప్ ఇరాన్ సరిహద్ధుకు అమెరికా దళాలను తరలిస్తున్నాడు. ఈక్రమంలో ఇరాన్ అగ్రరాజ్యానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా సైన్యాన్ని రంగంలోకి దించితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పై భూతల దాడికి సిద్ధమని ఇరాన్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ (IRIB) సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికా గనుక మధ్యప్రాచ్యంలో తన బలగాలను మోహరించి, ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే.. తాము ఊరుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ముఖ్యంగా UAE, బహ్రెయిన్ తీరప్రాంతాలను స్వాధీనం చేసుకుని, ఈ ప్రాంతపు భౌగోళిక రూపురేఖలనే మార్చేస్తామని ఇరాన్ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. UAE మెడపై కత్తిపెట్టి అమెరికాని ఇరాన్ బ్లాక్ మెయిల్ చేస్తోంది.
BREAKING : 🇮🇷🇺🇸🇦🇪 Iran is preparing to take over UAE with a ground invasion if the US put troops on the ground
— Times of Iran News (@Timesofiraan) March 25, 2026
IRIB Iranian state TV:
“If the United States makes a mistake, Iran’s armed forces are ready to seize the coastlines of the UAE and Bahrain and reshape the region” pic.twitter.com/bgZI7LEtO2
అమెరికా '82వ ఎయిర్‌బోర్న్ డివిజన్' ఫోర్స్ ఈ ప్రాంతానికి పంపుతుందనే వార్తలతో ఇరాన్ ఈ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కేవలం క్షిపణులతోనే కాకుండా, అవసరమైతే పొరుగు దేశాలపై నేరుగా భూతల దాడి చేస్తామని ఇరాన్ సంకేతాలిస్తోంది. హార్ముజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలపై దాడుల భయంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సిద్ధం చేశారు. ఇరాన్ ఈ ప్రకటనలు కేవలం బెదిరింపులేనా లేక నిజంగానే యుద్ధానికి దారితీస్తాయా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
Follow Us