Mojtaba Khamenei : మొజ్తాబా ఖమేనీకి ఏం కాలేదు...వీడియో విడుదల చేసిన ఇరాన్

ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడని కొందరు, మరణించాడని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌ ప్రభుత్వం ఆయన వీడియోను తొలిసారిగా మీడియాకు విడుదల చేసింది.   

New Update
FotoJet (27)

Mojtaba Khamenei

Mojtaba Khamenei : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్దం మొదలు పెట్టాక ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్‌ నాయకులు కూడా హతమయ్యారు. ఈ క్రమంలో ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ ఆచూకీపై కూడా  సస్పెన్స్ కొనసాగుతుంది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడని కొందరు, మరణించాడని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌ ప్రభుత్వం ఆయన వీడియోను తొలిసారిగా మీడియాకు విడుదల చేసింది.   


 
ఇరాన్ కొత్త సుప్రీం నేతగా ఎంపికైన అయతొల్లా మొజ్తాబా ఖమేనీ ఆచూకీపై ప్రపంచ వ్యాప్తంగా సస్పెన్స్ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన వీడియోను ఇరాన్ ప్రభుత్వ మీడియా దీన్ని విడుదల చేయడం చర్చనీయంశంగా మారింది. కాగా ఆ వీడియోలో కొంతమంది విద్యార్థులకు 'రెలిజియస్ సైన్స్'పై అరబిక్‌లో మొజ్తాబా బోధన చేస్తున్నట్టు అందులో కనిపిస్తోంది.  ఈ వీడియో ఒక నిమిషం 19 సెకండ్ల నిడివి కలిగి ఉంది.  కాగా దీన్ని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా అయిన  ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB) విడుదల చేసింది. అయితే దాన్ని ఎక్కడ రికార్డు చేశారు అనేది మాత్రం తెలియలేదు. అయితే ఇది చారిత్రక రికార్డు కోసం భద్రపరిచిన వీడియో కావచ్చనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి.'రెలిజియస్ సైన్స్ బోధిస్తున్న అయతొల్లా మొజ్తాబా ఖమేనీ వీడియాను తొలిసారి పబ్లిష్ చేస్తున్నాం' అంటూ ప్రభుత్వ మీడియా అయిన ఐఆర్ఐబీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.

కాగా, అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తొలిరోజే అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. ఆయన స్థానంలో మొజ్తాబా ఇరాన్ కొత్త సుప్రీంగా ఎన్నికయినట్లు ఆ దేశం ప్రకటించింది. అయితే ఆయన కూడా గాయపడ్డాడని, చనిపోయాడని ప్రచారం సాగింది. దీంతో అప్పట్నించి ఆయన ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొజ్తాబా సజీవంగా ఉన్నారో లేదో తాను చెప్పలేనని, ఆయనను చూసిన వారు కూడా లేరని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడంతో మరోసారి అనుమానాలు బలపడ్డాయి. అంతేకాదు అమెరికా దాడిలో ఆయన గుర్తుపట్టలేనంతా మారిపోయారని, ఒక కాలు కోల్పోయాడని,, తీవ్రంగా గాయపడినట్టు, కొందరైతే చనిపోయినట్టు చెబుతున్నారని ట్రంప్‌ తెలిపారు. అయితే ఆయన 100 శాతం ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం ఎవరూ చెప్పడం లేదని ట్రంప్‌ అన్న విషయం తెలిసిందే. తాజా వీడియోతో ఆయనకు ఏం కాలేదన్న సంకేతాలు ఇరాన్‌ ఇచ్చినట్లయిందని ప్రపంచం భావిస్తోంది.  

Advertisment
తాజా కథనాలు