IRAN WEAPONS : అమెరికాపై విరుచుకుపడుతున్న ఇరాన్‌..ఆ దేశ ఆయుధ సంపత్తి ఇదే..

అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌ పై దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ ఏ మాత్రం వెనకకు తగ్గడంలేదు. అమెరికాపై విరుచుకుపడుతూనే ఉంది. ఇరాన్‌ సుప్రీం చనిపోయినప్పటికీ వెనుకకు తగ్గని ఇరాన్‌  మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్‌ భీకర దాడులు చేస్తోంది.

New Update
FotoJet (1)

Iran’s Nuclear and Missile

 IRAN WEAPONS :  అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌ పై దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ ఏ మాత్రం వెనకకు తగ్గడంలేదు. అమెరికాపై విరుచుకుపడుతూనే ఉంది. ఇరాన్‌ సుప్రీం చనిపోయినప్పటికీ వెనుకకు తగ్గని ఇరాన్‌  మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్‌ భీకర దాడులు చేస్తోంది.ఇరాన్‌ వద్ద అత్యధికంగా బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నాయని తెలుస్తోంది.యుద్ధానికి ముందు ఇరాన్‌ వద్ద 3 వేల బాలిస్టిక్‌ మిస్సైళ్లు ఉండగా ప్రస్తుతం ఇరాన్ వద్ద 2,400 మిస్సైల్స్ ఉన్నట్లు అంచనా వేస్తు్నారు. ఇప్పటివరకు 570 పైగా మిస్సైళ్లను ఇరాన్‌ ప్రయోగించింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ దాడులకు దిగుతుంది.

ఇరాన్‌ వద్ద 400 మొబైల్‌ మిస్సైల్‌ లాంచర్లు ఉన్నాయి. అలాగేఇరాన్‌ ఆర్మీ & IRGC వద్ద 4 వేల మిలటరీ డ్రోన్స్‌ ఉన్నాయి.యుద్ధంలో ఇరాన్‌ ఇప్పటివరకు 1,400 డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్‌కు రష్యా, చైనా, నార్త్‌ కొరియా  సాయం చేస్తున్నాయి. ఇరాన్ క్షిపణి పరిధి, డ్రోన్ దాడుల శక్తి 4 వేల కి.మీ వరకు విస్తరించింది.హిజ్‌బొల్లా, హమాస్, హూతీల ద్వారా.ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు, సముద్ర మార్గాలపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌ దగ్గర ఉన్న ఆయుధాలు, ఇరాన్‌కు సాయం చేస్తున్న దేశాలు అందిస్తున్న ఆయుధాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

ఇరాన్‌ ఆయుధాలు: 

1. ఫతే-2 హైపర్ సోనిక్ క్షిపణి:1,500 కి.మీ
* ధ్వని కంటే 15 రెట్లు వేగంతో ప్రయాణించగలదు
* ఏ ఆధునిక రాడార్ వ్యవస్థ కూడా దీనిని అడ్డుకోలేదు
2. షాహాబ్ 3: 1,300 కి.మీ
* ఇరాన్ క్షిపణి వ్యవస్థలో అత్యంత పాతది 
* ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌లోని ఏ ప్రాంతానికైనా చేరుకోగలదు
3. ఖైబర్ షెకాన్: 1,450 కి.మీ
* IRGC అభివృద్ధి చేసిన మూడో తరం క్షిపణి
* సాలిడ్ ఫ్యూయల్‌తో పనిచేస్తుంది, నిమిషాల్లోనే ప్రయోగించవచ్చు
* శత్రువుల క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా దిశను మార్చుకోగల సామర్థ్యం
4. ఎమాద్: 1,700 కి.మీ
* ఇరాన్ మొదటి ప్రిసిషన్ గైడెడ్ క్షిపణి
* దీనిని రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు
* లక్ష్యాన్ని కొన్ని మీటర్ల తేడాతో ఖచ్చితంగా కొట్టగలదు
5. ఖోర్రామ్‌షహర్: 2,000 కి.మీ
* 1,800 కేజీల బరువున్న వార్‌హెడ్‌ను మోసుకెళ్తుంది
* ఒకే క్షిపణితో భారీ విధ్వంసం సృష్టిస్తోంది
* రెక్కలు లేకుండా ఇంజిన్ ద్వారానే దిశను మార్చుకుంటుంది
6. ఘద్ర్: 2,000 కి.మీ
* ట్రక్కులపై ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు
* లిక్విడ్‌ FUELతో నడిచే క్షిపణి
* రక్షణ వ్యవస్థలను వేగంగా చీల్చుకుంటూ వెళ్తుంది
7. సెజ్జిల్: 2,000 కి.మీ
* ఇరాన్ వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన క్షిపణి
* ఇది రెండు అంచెల SOLID FUEL MISSILE
* గాలిలో ఉన్నప్పుడు ఉపగ్రహాల ద్వారా గుర్తించడం చాలా కష్టం
8. సౌమర్: 2,500 కి.మీ
* ఇది ఒక క్రూయిజ్ క్షిపణి
* ఇది భూమికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది
* శత్రువుల రాడార్లకు అస్సలు చిక్కదు
* ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుదూర శ్రేణి క్షిపణి
 
ఇరాన్‌కు ఇతర దేశాల మద్దతు:

రష్యా

* Su-35 యుద్ధ విమానాలు
* Mi-28 హెలికాప్టర్లు
* S-400 రక్షణ వ్యవస్థ
* Yak-130 శిక్షణ విమానాలు
* ఇంటెలిజెన్స్ సపోర్ట్

చైనా

* బాలిస్టిక్ మిస్సైల్ కాంపోనెంట్స్
* కామికాజ్‌ డ్రోన్స్‌, అటాక్‌ డ్రోన్స్‌ 
* రేడార్, శాటిలైట్ మద్దతు
* సర్ఫేస్-టు-ఏర్ మిస్సైల్ బ్యాటరీలు

నార్త్‌ కొరియా

* బాలిస్టిక్ క్షిపణి సహకారం
* లాంచర్లు
* అణు సహకారం

Advertisment
తాజా కథనాలు