/rtv/media/media_files/2026/03/25/ship-selen-2026-03-25-16-39-14.jpg)
పశ్చిమాసియా యుద్ధంలో మధ్యవర్థిత్వం చేస్తా అన్నా పాకిస్తాన్(Pakistan Ship ‘Selen) కు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. శాంతి చర్చల మాటలు ఒకవైపు వినిపిస్తుంటే, క్షేత్రస్థాయిలో బాంబుల మోత, క్షిపణుల గర్జనలు మరోవైపు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్(strait of hormuz) జల సంధిలో ఇరాన్ తన పట్టును మరింత కఠినతరం చేస్తోంది. హర్మూజ్ జల సంధి(strait of hormuz oil crisis) గుండా కరాచీకి వెళ్తున్న 'సెలెన్' అనే ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాలు అడ్డుకున్నాయి. సరైన అనుమతులు లేవని, చట్టపరమైన నిబంధనలు పాటించలేదన్న సాకుతో ఆ నౌకను వెనక్కి పంపారు.
Also Read : యుద్ధంలో ట్రంప్ బిగ్ ట్విస్ట్.. చర్చలంటూనే రంగంలోకి 3వేల పవర్‌ఫుల్ ఆర్మీ!
Iran Intercepts Oil Tanker Selen En Route To Karachi
"వ్యూహాత్మక జలమార్గంలోకి ప్రవేశించే ప్రతి నౌక ఇరాన్ నేవీ అధికారుల సమన్వయంతోనే కదలాలి. ఇది ఇరాన్ సార్వభౌమాధికారానికి నిదర్శనం" అని IRGC కమాండర్ అలీరెజా తంగ్సిరి స్పష్టం చేశారు. ఈ చర్యతో ప్రపంచానికి అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గంపై ఇరాన్ తన సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఒకవైపు యుద్ధం పెరుగడంతో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రంగంలోకి దిగారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయి, పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు పాక్ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ముస్లిం ప్రపంచం ఐక్యంగా ఉండాలని, యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదని ఆయన నొక్కి చెప్పారు.
అమెరికా(america iran war) పంపిన 'కాల్పుల విరమణ' ప్రతిపాదనలను ఇస్లామాబాద్ ద్వారానే టెహ్రాన్‌కు చేరవేసినట్లు సమాచారం. అటు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా యూఏఈ, యూకే, చైనాల విదేశాంగ మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం గనుక ముదిరితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దౌత్య చర్చలు ఫలిస్తాయా లేక యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Also Read : పై(π) సూత్రంలో దాగిన బ్లాక్ హోల్ సీక్రెట్.. రామానుజన్ మైండ్ బ్లోయింగ్ ఫార్ములా!
Follow Us