Indian student gurukirat singh : కెనడాలో భారతీయ యువకుడిపై మూకుమ్మడి దాడి...పిడిగుద్దులు గుద్ది..వాహనం ఎక్కించి..

కెనడాలో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. అతని కాలేజీ విద్యార్థులే మూకుమ్మడిగా దాడి చేయడంతో  అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 10-12 మంది యువకులు అతనిపై ఒక్కసారిగా దాడి చేయడంతో సదరు యువకుడు మృతి చెందాడన్నారు.

New Update
FotoJet (22)

Indian student gurukirat singh

Indian student gurukirat singh : కెనడాలో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. అతని కాలేజీ విద్యార్థులే మూకుమ్మడిగా దాడి చేయడంతో  అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కాలేజీకి చెందిన 10-12 మంది యువకులు అతనిపై ఒక్కసారిగా దాడి చేయడంతో సదరు యువకుడు గాయాలపాలై ఆ తర్వాత మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కెనడాలోని  ఫోర్ట్ సెయింట్ జాన్ నగరంలో మార్చ్ 14న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన గురుకిరత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.

 మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌కు చెందిన గురుకిరత్ సింగ్ (23) మేనేజ్‌మెంట్ విద్య అభ్యసించడం కోసం కెనడా వెళ్లారు. కెనడాలోని నార్తన్ లైట్స్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సు చేస్తున్నారు. తన వ్యక్తిగత ఖర్చుల కోసం స్థానికంగా ఉన్న వాల్‌మార్ట్‌లో పార్ట్ టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు.  కాగా ఈ నెల 14న రాత్రి గురుకిరత్ వాల్‌మార్ట్‌లో తన ఉద్యోగం ముగించుకుని బయటకు వచ్చాడు. కాగా,  అప్పటికే అతనికోసం వేచి ఉన్న బాధితుడి   కాలేజీకి చెందిన 10-12 మంది యువకులు గురుకిరత్‌ను తమ వెంటబెట్టుకుని వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే అప్పటికే గురుకిరత్‌ కు తోటి విద్యార్థులకు మధ్య వివాదం నడుస్తున్నట్లు వారు తెలిపారు.  ఈ విషయమే మళ్లీ చర్చకు రావడంతో  వారి మధ్య గొడవ జరిగిందన్నారు. ఈ క్రమంలో ఆ యువకులు గురుకిరత్‌పై దాడి చేయడమే కాకుండా ఆపై తమ వాహనాన్ని అతడిపై ఎక్కించడంతో బాధితుడు తీవ్రంగా గాయపడి మరణించాడని చెప్పారు.


కాగా ఈ విషయమై అతని సోదరుడు ప్రభుకిరత్‌ సింగ్‌ మాట్లాడుతూ గురుకిరత్‌ సింగ్‌పై దాదాపు 12 మంది దాడి చేశారని ఆరోపించారు. తన సోదరుడి మృతి గురించి అర్ధరాత్రి ఫోన్ వచ్చినట్లు తెలిపారు. ఆ విషయం తెలిసి మేమంతా దిగ్భ్రాంతికి గురయ్యామని రోదిస్తూ తెలిపాడు. కాగా దాడికి కారణమైన వారిలో కొందరిని పోలీసులు అప్పటికే అరెస్టు చేశారని, అయితే  ఆ తరువాత వారి లాయర్లు రావడంతో విడిచిపెట్టారని ఆరోపించారు. కాగా, గురుకిరత్ మృతిని కెనడా ప్రభుత్వ అధికారులు కూడా ధ్రువీకరించారు. అతడి పోస్టు మార్టం నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురుకిరత్ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు సాయపడాలని మృతుడి కుటుంబం ప్రభుత్వాన్ని కోరింది.

Advertisment
తాజా కథనాలు