Hawaii helicopter Crash : హవాయిలో కూలిన హెలికాప్టర్‌...ముగ్గురు మృతి

అమెరికాలో నెలకొన్న హెలికాప్టర్‌ ప్రమాదంలో ముగ్గురు దుర్మారణం పాలయ్యారు. ఈ ప్రమాదం  హవాయి రాష్ట్రంలో జరగగా తీవ్ర విషాదాన్ని నింపింది. కౌవాయి (Kauai) దీవిలో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
FotoJet (4)

 Hawaii helicopter Crash Hawaii

 Hawaii helicopter Crash :  అమెరికాలో నెలకొన్న హెలికాప్టర్‌ ప్రమాదంలో ముగ్గురు దుర్మారణం పాలయ్యారు. ఈ ప్రమాదం  హవాయి రాష్ట్రంలో జరగగా తీవ్ర విషాదాన్ని నింపింది. కౌవాయి (Kauai) దీవిలో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పర్యాటక ప్రాంతమైన ‘కలలౌ బీచ్’ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ధృవీకరించారు.


 
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఉన్న అందమైన పర్యాటక ప్రాంతమైన కలలౌ బీచ్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక హెలికాప్టర్‌ నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో  హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయమై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ‘ఎయిర్ బోర్న్ ఏవియేషన్’ సంస్థకు చెందిందని అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా?  లేక వాతావరణ పరిస్థితులా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు