Prince Sultan Air Base attack: అమెరికా ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి..  సౌదీలో10 మంది అమెరికన్లకు గాయాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈరోజు తెల్లవారుజామున డ్రోన్ల దాడి జరిగింది.

New Update
FotoJet (3)

Iranian missiles and drones strike Prince Sultan Air Base

Prince Sultan Air Base attack: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అణుకేంద్రా లపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ రోజు  తెల్లవారుజామున డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిలో పది మంది అమెరికా సేవా సభ్యులు గాయపడ్డారు. కాగా ఈ దాడి వెనుక ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే ఉండి ఉండవచ్చని ప్రాథమిక అంచనా.


 ఎయిర్‌ బేస్‌ పై దాడిలో రెండు 'వన్-వే అటాక్' డ్రోన్లను ఉపయోగించారు. వారు ప్రయోగించిన మొదటి డ్రోన్ ఎయిర్ బేస్‌లోని నివాస ప్రాంతాల సమీపంలో పేలిపోయింది. దీంతో అక్కడ ఉన్న పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండవ డ్రోన్‌ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా గాలిలోనే ధ్వంసం చేయడంతో  దాని శిథిలాలు పడి అమెరికా సేవా సభ్యులు గాయపడ్డారు. ఈ దాడిలో 10 మంది గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు . కాగా గాయపడిన వారికి ప్రస్తుతం బేస్‌లోని మెడికల్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు.

కాగా ఈ దాడిని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తీవ్రంగా ఖండించింది. అమెరికా బలగాలకు భద్రత  కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ' మా దళాలపై జరిగే ఇటువంటి దాడులను మేము ఉపేక్షించం. తగిన సమయంలో, తగిన రీతిలో సమాధానం చెప్తాం'. అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి హెచ్చిరించారు. సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా  దీనిపై ఫైర్‌ అయ్యింది. ఈ దాడిని తీవ్రవాద చర్యగా అభివర్ణించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని, మిత్రదేశాల బలగాలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో, అమెరికా స్థావరాలపై దాడులు పెరుగుతున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు