Trump- Musk: రెండో సారి అధ్యక్ష బాధ్యతలు అందుకునేందుకు సిద్దమవుతున్నట్లు రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అంతేనా..ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లోనూ టెస్లా అధినేత ప్రభావం చాలానే కనపడుతుంది. Also Read: PV Sindhu Wedding : వేడుకగా పీవీ సింధు వివాహం..! దీంతో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా ?అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెసిడెంట్ కాలేరని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలిసారి అరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ పాల్గొన్నారు. Also Read: Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి! ఆయన ఈ దేశంలో జన్మించలేదు.. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మస్క్ అంటూ డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలపై ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. ఆయన అధ్యక్షుడు కాలేరని నేను చెప్పగలను. ఎందుకో తెలుసా? ఆయన ఈ దేశంలో జన్మించలేదు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. Also Read: Train Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని! టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత అయిన మస్క్..దక్షిణాఫ్రికాలో జన్మించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం...అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడై ఉండాలంటూ ట్రంప్ సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే...డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌తో పన్నుల అంశంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ భారీ టారిఫ్‌లు వసూలు చేస్తోందన్నారు. అందుకే తాము కూడా ప్రతీకార పన్ను తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. బుధవారం ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికా ప్రొడక్ట్స్ పై భారత్ తోపాటు బ్రెజిల్ వంటి దేశాలు అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ట్రంప్ మాట్లడుతూ.. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. పలు దేశాలు మా ఉత్పత్తులపై 100, 200శాతం పన్నులు విధిస్తున్నాయి. వాళ్లు మాపై పన్నులు విధిస్తే మేమూ అంతేస్థాయిలో స్పందిస్తాం. భారత్ 100శాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్ చేయడంలో తప్పేమి లేదు. ఆయా దేశాలు పన్ను వసూలుచేయడం వారి ఇష్టమే అయినప్పటికీ మాకు కూడా ఆ హక్కు ఉంటుందని గుర్తించాలని సూచించారు. Also Read: అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్..బెయిల్ రద్దుకు నేడు పిటిషన్! దీంతో మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశమవగా గతంలోనూ ట్రంప్ పలుసార్లు పన్నులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవలే అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తామని గతంలోనూ చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది.