Bitcoin: కేవలం 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం

క్రిప్టో కరెన్సీ మార్కట్లో బలహీనత కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణం. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్‌ కాయిన్‌ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే 6500 డాలర్లు అంటే సుమారు రూ. 5.5 లక్షల మేర నష్టపోయింది.

New Update
Bitcoin: భారీగా పెరిగిన బిట్​కాయిన్​.. కారణం ఇదే!

Bit Coin: క్రిప్టో కరెన్సీ మార్కట్లో బలహీనత కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణం. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్‌ కాయిన్‌ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే 6500 డాలర్లు అంటే సుమారు రూ. 5.5 లక్షల మేర నష్టపోయింది. ఇవాళ 96,593 డాలర్ల వద్ద మొదలైన బీటీసీ  539 డాలర్ల నష్టంతో 96,093 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read: TTD: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే!

ఎంసీఏపీ 1.94 ట్రిలియన్ల డాలర్ల నుంచి 1.91 ట్రిలియన్ల డాలర్లకు తగ్గింది. ఈటీహెచ్‌, యూఎస్‌డీటీ,ఎక్స్‌ఆర్పీ, ఎస్‌ఓఎల్‌, బీఎన్‌పీ,డీఓజీఈ, యూఎస్‌డీసీ, ఏడీఏ,టీఆర్‌ఎక్స్‌ కాయిన్లూ నష్టాల్లోనే ఉన్నాయి.

Also Read: Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ విలువ ఏకంగా 1,00,000 డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో కొన్నాళ్లుగా ఇది భారీగా ర్యాలీ చేస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు వారాల్లోనే దీని విలువ 45 శాతం పెరిగిందంటే దీని దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్‌..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్‌ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇది 1,00,000 డాలర్ల మార్కును దాటేసింది. ఒక దశలో అత్యధికంగా 1,00,512 ను తాకింది. మడ్‌రెక్స్‌ సీఈవో ఈ పరిణామాల పై స్పందిస్తూ బిట్‌ కాయిన్‌ వెనక మస్క్‌ కు డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ సామర్థ్యం కట్టబెట్టడం వంటి కారణాలు ఉన్నాయి.

Also Read: Ap: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌...క్రిస్మస్‌,సంక్రాంతి కానుకలు!

దీంతోపాటు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజీ కమిషన్‌ చైర్మన్‌ గా పాల్‌ అట్కిన్‌ కు ట్రంప్‌ బాధ్యతలు అప్పగించడం వంటివి కలిసొచ్చాయి. దీంతో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి. భవిష్యత్తులో బిట్‌కాయిన్‌ 1,20,000 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గతంలో పాల్‌ అట్కిన్‌ గతంలో జార్ డబ్ల్యూ బుష్‌ హయాంలో కూడా ఎస్‌ఈసీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పదవిని వీడాక అమెరికాలో మార్కెట్‌ నియంత్రణ చాలా తీవ్రంగా ఉందని న్యాయపోరాటం చేశారు. తాజాగా మళ్లీ ఆయనకే ట్రంప్‌ ఎస్‌ఈసీ పగ్గాలు అప్పజెప్పడం విశేషం. అమెరికా ఎన్నికల రోజున బిట్‌ కాయిన్‌ విలువ 69,374 డాలర్లుగా ఉంది.రెండేళ్ల క్రితం 17,000 డాలర్ల దిగువకు జారిపోయిన ఈ క్రిప్టో  కరెన్సీ ఇప్పుడు లక్ష డాలర్లను దాటేయడం  విశేషం. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు