/rtv/media/media_files/2026/04/06/strait-of-hormuz-2026-04-06-11-39-36.jpg)
దాదాపు నెల రోజులకు పైగా ప్రపంచాన్ని వణికిస్తున్న పశ్చిమాసియ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది. పాకిస్తాన్ ఆ రెండు దేశాల మధ్య సంధి(ceasefire) కుదిర్చడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందేమో అన్న భయాందోళనల మధ్య, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో చర్చలు జరపడానికి, ఒక డీల్‌కు రావడానికి గతంలో విధించిన గడువును మరో రెండు వారాల పాటు (14 రోజులు) పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. - iran conditions to open hormuz strait
Also Read : యుద్ధంలో చక్రం తిప్పిన పాకిస్తాన్.. శత్రు దేశమైనా మెచ్చుకోవాల్సిందే!
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం
మంగళవారం సాయంత్రం ట్రంప్(47th us president donald trump) చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. "ఒక సంపూర్ణ నాగరికత ఈ రాత్రి నాశనం కావచ్చు, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు" అంటూ ఆయన చేసిన హెచ్చరికతో యుద్ధం ఖాయమని అందరూ భావించారు. అయితే, పాకిస్తాన్ చేసిన ప్రత్యేక అభ్యర్థన మేరకు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 14 రోజుల పాటు దాడులను నిలిపివేస్తూ, శాంతి చర్చలకు అవకాశం కల్పించారు.
సీజ్ ఫైర్‌కు షరతు ఇదే!
ఈ గడువు పొడిగింపు ఊరికే జరగలేదు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకోవాలనే షరతుపైనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 'సీజ్ ఫైర్' రెండు వైపులా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రపోజల్‌ను పరిశీలించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.
ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్(america iran war) కూడా సానుకూలంగా స్పందించింది. రానున్న రెండు వారాల పాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చి అధికారికంగా ప్రకటించారు. తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తే, తాము కూడా దాడులకు వెళ్ళమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్‌తో సాంకేతిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని నౌకల రాకపోకలకు అనుమతినిచ్చారు.
Also Read : రాబోయే 48 గంటలు ఇళ్లల్లోనే ఉండండి.. ఇరాన్‌లోని ఇండియన్స్‌కు కేంద్రం హెచ్చరిక
ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు
చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లు, ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ 14 రోజుల్లో చర్చలు సఫలమైతే యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది.
Follow Us