/rtv/media/media_files/2026/03/21/natanz-nuclear-site-2026-03-21-18-48-22.jpg)
Natanz nuclear site
Natanz nuclear site : అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తీవ్రంగా నష్టపోతుంది. అయినా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఆ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. పరస్పర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇదిలా ఉండగా తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై మరోసారి దాడులకు పాల్పడడం కలకలం సృష్టించింది. అమెరికా, ఇజ్రాయెల్ అణుకేంద్రం పై దాడిచేసిన విషయాన్ని స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ నిర్ధారించింది. కాగా యుద్ధం మొదలైన తర్వాత నతాంజ్ అణు క్షేత్రంపై వైమానిక దాడులు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కాగా నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడ్డప్పటికీ ఎలాంటి నష్టం జరగలేదని, అలాగే రేడియోధార్మిక పదార్థాల లీకేజీ జరగలేదని, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని మీడియా వెల్లడించింది
అయితే అణుకేంద్రం పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు పాల్పడడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, ఇతర అణు భద్రత నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని ఆరోపించింది. నేరపూరిత చర్యల్లో భాగంగానే నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయని ఫైర్ అయింది. కాగా యుద్ధం మొదలైన మొదటి వారంలోనే నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, ఇక ఆ దేశానికి యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ చేసే సామర్థ్యం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించడం గమనార్హం. అయితే ఆయన ప్రకటించిన కొద్ది గంటల్లోనే నతాంజ్ అణు కేంద్రంపై దాడులు జరగడం ఆశ్చర్యం కలిగించే అంశం.
Follow Us