/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
gold uppal shop
దొంగలు బాగా మితిమిరిపోయారు. దొంగతనాలు ఎలా చేయాలో రాటుదేలుతున్నారు. ఈజీగా డబ్బులు కొట్టేసే విషయంలో పీహెచ్డీలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) లోని ఉప్పల్ లో ఓ జంట గోల్డ్షాపు యజమానికి మస్కా కొట్టింది. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి అసలు బంగరాన్ని ఎత్తుకెళ్లింది.
Also Read : టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఎస్సై బుగ్గయ్య కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన కావలి లక్ష్మి(35) తిరుపతి(42) దంపతులు వ్యవసాయ కూలీలు. డబ్బు ఆశతో తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో హైదరాబాద్ కు వచ్చి దందా మొదలు పెట్టారు. గోల్డ్షాపులో వృద్ధులున్నా, ఒకరే ఉంటే వీరు టార్గెట్ చేస్తారు. తాజాగా ఉప్పల్ భరత్ నగర్ లోని ఓ జ్యువెలరీ షాపుకు వచ్చారు. కావలి లక్ష్మి నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి వడ్డీకి రూ.20వేలు తీసుకుంది.
Also Read : భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
ఆ తరువాత బంగారు డాలర్లు కావాలంటూ షాపు యజమాని రాకేష్ శర్మను అడిగింది. అతను కొన్ని చూపించి మిగితా వాటి కోసం లోపలకు వెళ్లడంతో అక్కడున్న వాటిలో 12 గ్రాముల బంగారు డాలర్లను కొట్టేసిన లక్ష్మి.. ఏం తెలియనట్టుగా బయటకు వచ్చేసింది. ఈ టైమ్ లో ఆమె భర్త తిరుపతి షాపు బయట ఉంటూ వచ్చిపోయే వారిని గమనిస్తూ ఉన్నాడు. అనంతరం ఇద్దరూ అక్కడినుంచి పారరయ్యారు.
Also Read : వీడు కొడుకేనా.. అడిగింది ఇవ్వలేదని తండ్రి పీకను రంపంతో కోసి..
వాళ్లు వెళ్లాక రాకేష్‌శర్మ తాకట్టు పెట్టిన బంగారాన్ని పరిశీలించగా అది వన్ గ్రామ్ గోల్డ్ అని తెలిసింది. సీసీ కెమెరాల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని ఉప్పల్ రింగురోడ్డులో అదుపులో తీసుకున్నారు. మరో షాపులో ఇదే తరహాలో మోసం చేసినట్టు విచారణలో ఒప్పుకొన్నారు. గతంలో వీరికి జైలుకు వెళ్లిన అనుభవం కూడా ఉంది. 2016లోనూ అల్లూరులో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. వీరి నుంచి రూ.1.20లక్షలు, బైక్, సెల్‌ఫోన్, చోరీ చేసిన బంగారాన్ని (Gold) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Atishi Marlena : సీఎం పదవికి అతిషి రాజీనామా