Mancherial: విషాదం.. నవ వధువు ప్రాణం తీసిన హీటర్

స్నానం కోసం పెట్టిన వాటర్‌లో చేయి పెట్టి హీటర్ తీయడంతో నవ వధువు షాక్ కొట్టి మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పెళ్లయి నాలుగు రోజులు కాకుండానే కొత్త పెళ్లి కూతురు మరణించడంతో భర్త, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.

New Update
water

వివాహ బంధంలోకి అడుగు పెట్టి వారం రోజులైన కాకముందే.. నవ వధువు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాకు చెందిన జంబి స్వప్న అనే యువతి అదే గ్రామానికి చెందిన సిద్ధుని ప్రేమించింది. ఇద్దరు వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోయిన ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. చలికాలం కావడంతో స్వప్న వేడి నీరు స్నానం చేసి హీటర్‌ను ఉపయోగించింది. ఆ సమయంలో కరెంట్ పలుమార్లు వెళ్లి వచ్చింది.

ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

కరెంట్ లేదని చేయి పెట్టగా..

ఈ క్రమంలో కరెంట్ లేదని స్వప్న ఆ వాటర్‌లో చేయి పెట్టి హీటర్ తీసింది. దీంతో కరెంట్ షాక్ కొట్టి మృతి చెసింది. పెళ్లయిన నాలుగు రోజులకే ఇలా జరగడంతో భర్త రోధిస్తున్నారు. సిద్ధూకి తండ్రి లేడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. ఇంతలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్వప్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా

ఇదిలా ఉండగా ఇటీవల వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గేటువనంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. అరుంధ అనే వివాహిత మేకలకు మేత వేద్దామని కూతురు ప్రజ్వల, కుమారుడు రిత్విక్‌ని పొలం వద్దకు తీసుకెళ్లింది. అనంతరం ఆమె ముందు కూతురుని బావిలో తొయ్యడానికి ప్రయత్నించింది.

ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!

కానీ కూతురు ప్రజ్వల అమ్మ నన్ను బావిలో తొయ్యకు అమ్మ అంటూ వేడుకోవడంతో తనను ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత కొడుకును బావిలో తోసి అరుంధ ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇంటికి చేరుకున్న ప్రజ్వల జరిగిన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి ప్రజ్వలను ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు