17 రోజులు ప్లాన్ చేశారు.. ముగ్గురు మహిళలను 24 బై 7 అబసర్వేషన్ లో ఉంచారు. చాలా ఈసీగా రూ.5.5 కోట్లు కొట్టేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో చోటుచేసుకుంది. డిసెంబర్ 8న ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలు భారతి భాయి అగర్వాల్(67) టీజీసీఎస్‌బీలో ఫిర్యాదు చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. Also Read: మోహన్ బాబుకు బిగ్ షాక్.. పద్మశ్రీ రద్దు? తల్లీ, ఇద్దరు బిడ్డలను మోసం చేసి సైబర్ నేరస్తులు రూ.5 కోట్లు కొట్టేశారు. మనీలాండరింగ్, డ్రగ్స్ కేసులో ఆమె ఆధార్ కార్డ్ ఇన్వాల్మెంట్ ఉందని దుండగులు బెదిరించారు. TRAI డిపార్ట్‌మెంట్ నుంచి ఫోన్ చేసి తన పేరు రాహుల్ కుమార్, ఆఫీసర్‌ని అని నవంబర్ 13న భారతి భాయి అగర్వాల్‌కు కాల్ చేశారు. తర్వాత అతను ఆ కాల్‌ను సీబీఐ, ఆర్జీఐ ఆఫీర్లకు ట్రాన్స్‌వర్ చేశామంటూ మాయమాటలు చెప్పారు. వారిని నమ్మించడానికి ఫేక్ డాక్యుమెంట్స్, ఐడీ కార్డ్స్ చూపించారు. మనీలాండరింగ్, డ్రగ్స్ కేసులో మీ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందని బెదిరించారు. భారతితోపాటు ఆమె ఇద్దరు కూతుళ్లను సైబర్ క్రిమినల్స్ 17 రోజుల పాటు 24 గంటలపాటు డిజిటల్ అరెస్ట్ నిఘాలో పెట్టారు. ఇది కూడా చదవండి: Samantha : 2025 లో సమంత పెళ్లి.. వైరల్ అవుతున్న పోస్ట్ సౌరవ్ శర్మ, అజయ్ గుప్తా అనే ఇద్దరు వ్యక్తులకు సీబీఐ, ఆర్బీఐ అధికారులుగా ఆమెతో స్కైప్‌లో కాల్ మాట్లాడారు. కేసు నుంచి తప్పించాలంటే 5.5 కోట్లను ఇవ్వాలని మహిళను డిమాండ్ చేశారు. వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల గురించి నింధితులు ప్రశ్నించారు. బ్యాంక్ డిటేల్స్ గురించి బలవంతంగా తెలుసుకున్నారు. బాధితురాలి అకౌంట్ నుంచి దశల వారీగా 17 రోజుల్లో రూ.5.5 కోట్లు ఆన్ లైన్లో బదిలీ చేసుకున్నారు. Also Read: Techie Suicide: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ మనీలాండరింగ్, డ్రగ్స్ సప్లై కేసులో జైలుకు పంపుతామని బ్లాక్ మెయిల్ చేశారు. వారు అడిగినంత అమౌంట్ భారతి ఇచ్చేసింది. తర్వాత అది ఫేక్ కాల్ అని, వారు మోసపోయామని తెలుసుకున్నారు. భారతి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) సిబ్బందికి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2008 IT యాక్ట్ లోని సెక్షన్లు 66D, BNS చట్టాల కింద FIR నమోదు చేశారు.