Crime: తన ప్రియుడు మరో మహిళతో సన్నిహితంగా ఉండటం తట్టుకోలేక ఓ యువతి దారుణానికి పాల్పడింది. ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు దూరమవుతున్నాడనే బాధతోపాటు కేవలం శృంగారం కోసం మరో స్త్రీ మోజులో పడి తనను కాదన్నాడనే కోపంతో రగిలిపోయింది. అంతేకాదు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి కొంతకాలం తిరిగిన యువకుడు.. మరో అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసేందుకు సిద్ధం కావడంతో తట్టుకోలేక అమ్మోరు అవతారమెత్తింది. తనకు దక్కని వాడు ఇంకెవరికి దక్కడానికి వీళ్లేదని భావించిన ఆమె ఏకంగా అతన్ని సంసారానికి పనికిరాకుండా చేసింది. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. मुज़फ्फरनगर : प्रेमिका ने प्रेमी का काटा गुप्तांग➡प्रेमी द्वारा प्यार में धोखा मिलने से काटा गुप्तांग➡प्रेमिका ने मिलने के बहाने बुलाकर गुप्तांग काटा➡8 साल से चल रहा था दोनों के बीच अफेयर➡प्रेमी की शादी दूसरी लड़की से तय होने से थी नाराज➡पुलिस ने प्रेमी को जिला… pic.twitter.com/OIQydCiPa0 — भारत समाचार | Bharat Samachar (@bstvlive) December 22, 2024 చివరిసారి కలుద్దామని నమ్మించి.. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ యువ జంట.. అనుకోకుండా కొన్ని రోజులు దూరమైంది. ఈ క్రమంలో ప్రియుడు మరో యువతితో సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం స్నేహితుల ద్వారా ప్రియురాలికి తెలిసింది. దీంతో పగతో రగిలిపోయిన ఆమె.. చివరిసారి కలుద్దామంటూ అతన్ని నమ్మించి ఓచోటుకు పిలిచింది. ఒకసారి ఏకాంతంగా గడపాలని ఉందంటూ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి పెళ్లి గురించి ఆరాతీసింది. ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచిన ప్రెస్ మీట్.. ఆ ఒక్క మాటతో..! ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తన వెంట తెచ్చిన కత్తితో ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసింది. ఆ తర్వాత తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పటికే రక్తం మడుగులో ఉన్న ప్రియుడు.. తనకు కట్టుకట్టుకుని, ఆమెకు కట్టు కట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు ఇద్దరినీ హాస్పిటల్కు తరలించగా అతడు చికిత్స పొందుతున్నారు. ఆమెకు చికిత్స అందించి అరెస్టు చేశారు. పోలీసులతో కలిసి యువతి హాస్పిటల్ నుంచి బయటకొస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.