/rtv/media/media_files/2025/03/05/3rp2hpdnGHCIltPkt2Lu.jpg)
మలక్ పేటలో జరిగిన శిరీష హత్య కేసు (Murder Case) ను ఎట్టకేలకు పోలీసులు చేధించారు. శిరీషను ఆమె భర్త వినయ్ కుమార్, ఆడపడుచు సరిత కలిసి చంపినట్లుగా పోలీసులు తేల్చారు. శిరీషను పక్కా ప్లాన్ ప్రకారం వారు హత్య చేసినట్లుగా పోలీసులు నిర్థారించారు. అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని మత్తుమందు ఇచ్చి అక్కతో కలిసి కట్టుకున్న భార్యను హత్య చేశాడు వినయ్. దీంతో వినయ్ కుమార్, సరితలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : సుంకాలతో డిష్యూం డిష్యూం..యూఎస్- చైనా- కెనడా వార్
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నకూతురైన శిరీషను కరీంనగర్ కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకుని చదవించాడు. చదవుకునే టైమ్ లో నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ ప్రేమంటూ శిరీషను వలలో వేసుకున్నాడు. అప్పటికే వినయ్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటిభార్యను చంపేసినట్లుగా, రెండో భార్య ఇతడి టార్చర్ తట్టుకోలేక పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అతడి మాయమాటలు నమ్మిన శిరీష 2016లో వినయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని ప్రొఫెసర్ కుటుంబం ఆమెను దూరం పెట్టింది.
Also Read : కుంభమేళా వల్ల పడవలు నడిపే వ్యక్తికి రూ. 30 కోట్ల ఆదాయం..యోగి ఆదిత్య నాథ్
మలక్‌పేట (Malakpet) లోని జమున టవర్స్‌లో ఉంటున్న వినయ్, శిరీష్ కొత్తగా కాపురం పెట్టారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉండగా... శిరీష్ ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. 2019లో వీరికి ఓ పాప జన్మించింది. అయితే శిరీషపై అనుమానం పెంచుకున్న వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఆడపడుచు సరితతో కూడా ఆమెకు గొడవలు అయ్యేవి. ఈ క్రమంలో మార్చి 02వ తేదీన శిరీషతో మరోసారి గొడవ కాగా సరిత ఆమెను చంపేసింది. హత్య విషయం తెలిసినా దాన్ని బయటపెట్టకుండా సోదరి సరితతో కలిసి శిరీష మృతదేహాన్ని వినయ్ మాయం చేయాలనున్నాడు. ముందుగా శిరీషకు మత్తుమందు ఇచ్చి ఆ తరువాత స్పృహ కోల్పోయాక ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.
Also Read : కోడిని కోశావా.. కోడి మిస్సింగ్ కేసులో వ్యక్తికి పోలీసుల థర్డ్ డిగ్రీ
మేనమామ ఎంట్రీతో మారిన స్టోరీ!
ఆ తరువాత శిరీషకు గుండెపోటు వచ్చిందని ఆమె సోదరి స్వాతికి ఫోన్ చేశాడు వినయ్. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేట్‌లో ఉంటున్న తన మేనమామ మధుకర్‌కు చెప్పింది. దీంతో ఆయన శిరీష నెంబర్ కు ఫోన్ చేయగా అట్నుంచి మాట్లాడిన వాళ్లతో తాను వచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని కోరాడు. అయితే అప్పటికే హాస్పిటల్ నుంచి శిరీష మృతదేహాన్ని అంబులెన్స్‌లో నాగర్‌కర్నూలు తీసుకెళ్తున్నట్లుగా తెలుసుకున్న మధుకర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసుల సహయంతో అంబులెన్స్ డ్రైవర్, వినయ్‌తో ఫోన్‌లో మాట్లాడించి ఆమె మృతదేహాన్ని సోమవారం హైదరాబాద్ కు రప్పించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు.
పోస్టుమార్టం రిపోర్టులో ఆమెది హత్యనేని తేలింది. శిరీష మెడ చుట్టూ గాయాలు కనిపించడంతో ఆమె బంధువులు వినయ్ ను నిలదీశారు. గుండెలో నొప్పి రావడంతో సీపీఆర్ చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గీసుకుపోయాయంటూ పొంతనలేని సమాధానాలు చెప్పాడు వినయ్. దీంతో అనుమానం వచ్చిన మధుకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తమదైన స్టైల్ లో పోలీసులు విచారణ చేయగా వినయ్, సరిత అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. చివరకు తల్లిదండ్రులను కోల్పోయి.. దత్తత తీసుకున్నళ్లోకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమైంది శిరీష. ఆమె మేనమామ మధుకర్ లేకుంటే శిరీష మృతి ఎప్పటికే మిస్టరీగానే ఉండేదేమో..!
Also read : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇంటర్‌పోల్ చేతికి నిందితులు..!