Road Accident: కడపలో ఘోర ప్రమాదం.. భార్యా భర్తలిద్దరు స్పాట్ డెడ్!

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బులవారి పల్లి మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఓ కుటుంబం ప్రయాణిస్తున్న బైక్, అటుగా వస్తున్న టెంపో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో స్కూటర్ పై ఉన్న భార్య, భర్తలిద్దరూ మృతి చెందగా. ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి.

New Update
bike accident Kadapa

bike accident Kadapa

Kadapa Accident:  రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసినప్పటికీ.. కొంతమంది నిర్లక్ష్యం, అజాగ్రత్త రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కడపలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 

Also Read: Hansika: హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు!

భార్య భర్తలిద్దరూ అక్కడిక్కడే మృతి.. 

అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లి మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద భార్య, భర్తలు తమ ఇద్దరి పిల్లలతో ప్రయాణిస్తున్న స్కూటర్ ని అటుగా వస్తున్న టెంపో రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటర్ పై ఉన్న భార్య భర్తలు  నరసింహులు (40),  సుజాత (35)  అక్కడిక్కడే మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు కావడంతో రాజంపేట ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు. మృతులను రాజంపేట మండలం భువనగిరి పల్లికు చెందిన వారిగా గుర్తించారు.

Also Read: CV Anand Apology: అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ!

అనంతపురంలో మరో ఘటన 

ఇటీవలే అనంతపురంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిబండ మండలం కేఎన్‌ పల్లి గ్రామంలో ఓ కుటుంబానికి చెందిన 10 మందికి పైగా సభ్యులు  తిరుమల శ్రీవారి దర్శనానికి టెంపో ట్రావెల్స్ లో వెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణంలో మడకశిర మండలం బుల్లసముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టీటీ వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో టీటీ వాహనంలో ఉన్న ప్రేమ్ కుమార్,  అతర్వా, డ్రైవర్‌ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read: Teacher Kidnap: ఏపీలో దారుణం.. క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు