Yash : రాకీ భాయ్ సింప్లిసిటీ: భార్యతో కలిసి రోడ్డు పక్కన ..Photos viral

కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్, మరోసారి తన సింప్లిసిటీతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన భార్య రాధికా పండిట్, పిల్లలు ఆయ్రా, యథర్వ్‌లతో కలిసి

New Update
yash

కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్, మరోసారి తన సింప్లిసిటీతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన భార్య రాధికా పండిట్, పిల్లలు ఆయ్రా, యథర్వ్‌లతో కలిసి కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో సందడి చేశారు. కర్ణాటకలోని శిరాలిలో ఉన్న చిత్రపూర్ మఠాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్న తర్వాత, తిరిగి వస్తూ దారి పక్కన ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గర ఆగి ఐస్ క్యాండీలు కొన్నారు.

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్

ఈ సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో యశ్ చాలా సాధారణంగా లావెండర్ కలర్ షర్టు ధరించి, జుట్టును పోనీటైల్ లాగా ముడివేసి కనిపించారు. ఆయన భార్య రాధికా పండిట్ కూడా గులాబీ రంగు చురీదార్‌లో చాలా సింపుల్‌గా ఆ షాపు బయట కూర్చుని ఉన్నారు. ఇంత పెద్ద స్టార్ హోదా ఉండి కూడా, సామాన్యుడిలా రోడ్డు పక్కన ఐస్ కొనుక్కోవడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

స్క్రీన్ మీద కింగ్.. రియల్ లైఫ్‌లో చాలా వినయస్తుడు.అంత స్టార్డం ఉన్నా యశ్ మాత్రం మనలాగే చాలా సింపుల్‌గా ఉంటారు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో ముంచెత్తుతున్నారు. యశ్ తన పర్సనల్ లైఫ్‌ను ఎంత సాధారణంగా గడుపుతారో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.

సినిమాల విషయానికి వస్తే, యశ్ ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం రామాయణంలో రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. దీనితో పాటు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' అనే సినిమాలో కూడా యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

Advertisment
తాజా కథనాలు