/rtv/media/media_files/2026/03/20/ustaad-bhagat-singh-2026-03-20-10-40-20.jpg)
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా ఉగాది సందర్భంగా విడుదలై బాక్సఫీస్ వద్ద మంచి స్టార్ట్ అందుకుంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బుకింగ్స్ మాత్రం బలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బుక్ మై షోలో ఈ సినిమా మంచి రికార్డులు నమోదు చేస్తోంది. గత 24 గంటల్లోనే 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తం మీద ఇప్పటివరకు 6 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. త్వరలోనే 10 లక్షల టికెట్ల మార్క్ దాటే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో "ధురంధర్ 2" పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమా తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ బుకింగ్స్ చూస్తే పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ ఇంకా ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది.
ఇక విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చింది. నార్త్ అమెరికాలో ఇప్పటికే 5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇది సినిమా ప్రారంభానికి మంచి సంకేతం అని చెప్పొచ్చు. వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ సినిమాలో పార్థిబన్, రావు రమేష్, గౌతమి, కె.ఎస్. రవికుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.
మొత్తానికి, మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ "ఉస్తాద్ భగత్ సింగ్" బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ తీసుకుంది. వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్లు ఇంకా ఎలా పెరుగుతాయో చూడాలి.
Follow Us