సిల్వర్ స్ర్కీన్ పై ఓ హీరోయిన్ మహా అయితే పదేళ్ల పాటు ఉంటుందేమో కానీ ఇరవై ఏండ్లకుపైగా హీరోయిన్ గా రాణిస్తూ అంతేకాకుండా స్టార్‌డమ్‌ను అలానే కాపాడుకోవడం అనేది మాములు విషయం కాదు కానీ త్రిష మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో ఉంది. 40 ఏళ్ల త్రిష చేతిలో ఇప్పటికీ ఐదు సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుండగా త్రిషకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే.. సామాజిక సమస్యలపై పోరాడుతూ, ప్రజా సేవ చెయ్యాలన్నది తన ఆలోచన అని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది త్రిష. ఇలా చేయాలంటే కేవలం రాజకీయాల వల్లే సాధ్యమని ఆమె అభిప్రాయపడింది. తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందన్న త్రిష.. ఏదో ఒకరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. త్రిష కామెంట్స్ చూస్తుంటే ఆమె వచ్చే ఎన్నికల టైమ్ నాటికి రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తుంది. విజయ్‌కి పోటీగా రాజకీయాల్లోకి! తమిళనాడు రాజకీయాలను, సినిమాలను వేరువేరుగా చూడలేము. ఈ రెండింటికీ విడదీయరాని సంబంధం ఉంది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయలలిత అక్కడి రాజకీయాలను శాసించారు. ఆ తరువాత చాలా మంది హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చిన అందరూ సక్సెస్ కాలేకపోయారు. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ కూడా సినిమాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీని స్థాపించారు. హీరోయిన్ త్రిష కూడా విజయ్ కు మంచి ఫ్రెండ్ . మరి ఆమె భవిష్యత్తులో విజయ్ పార్టీలో చేరుతుందా లేకా కొత్త పార్టీ ఏమైనా పెడుతుందా అన్నది చూడాలి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇప్పటివరకు విజయ్ సినిమాలో తప్ప మరెవ్వరి సినిమాల్లో కూడా త్రిష ఐటమ్ సాంగ్ చేయలేదు. మరి అలాంటి త్రిష .. విజయ్‌కి పోటీగా రాజకీయాల్లోకి వస్తుందా అన్నది ఇంట్రెస్టి్ంగ్ పాయింట్. ఇక తమిళనాడు అసెంబ్లీకి 2026 ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అక్కడ బలంగా ఉంది. Also Read : బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్