/rtv/media/media_files/2025/11/16/varanasi-title-glimpse-2025-11-16-15-10-24.jpg)
Varanasi Title Glimpse
Varanasi Title Glimpse: భారీ గ్రాఫిక్స్ విజువల్ ఇవ్వడంలో ముందుండే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli), తన కొత్త సినిమా వారణాసి టైటిల్‌ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌లో ఆవిష్కరించారు. ఈ గ్లింప్స్‌ను 130×100 అడుగుల భారీ స్క్రీన్‌పై చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడ ఉన్నవారు విజువల్స్‌ని చూసి మంత్ర ముగ్దులయ్యారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు రాముడి స్పూర్తి ఉన్నట్టు ఈ గ్లింప్స్‌లో స్పష్టంగా చూపించారు. అలాగే, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్విరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. వారణాసి నగరానికి ఉన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని అద్భుతమైన విజువల్స్‌తో చూపించడం అందరి మనసులను ఆకట్టుకుంది.
టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయిన వెంటనే, అభిమానులు ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ చేస్తున్నారు. వారణాసి గ్లింప్స్‌ను అవతార్: ఫైర్ అండ్ అష్(Avatar Fire and Ash) సినిమా విడుదల సమయంలో థియేటర్లలో అటాచ్ చేయాలని వారు కోరుతున్నారు. ఇది నిజమైతే, వారణాసి ప్రమోషన్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ లాభం చేకూరుతుంది. ఎందుకంటే అవతార్ విడుదల అవుతున్నప్పుడు ప్రపంచంలోని వేలాది థియేటర్లలో లక్షలాది మంది ప్రేక్షకులు ఉంటారు.
అయితే, ఈ ప్రత్యేక ప్లాన్‌ను రాజమౌళి టీమ్ ఆలోచిస్తున్నారా అన్నదానిపై క్లారిటీ లేదు. వారణాసి కోసం డిస్నీ గ్లోబల్ భాగస్వామిగా ఉండొచ్చని వార్తలు ఉన్నాయి. అది నిజమైతే అవతార్‌తో వరాణాసి గ్లింప్స్ చూపించడం సులభం అవుతుంది. అంతేకాదు, రాజమౌళి, అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని కూడా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.
ఇక మరో వైపు, మార్వెల్ కూడా తన రాబోయే అవెంజర్స్: డూమ్స్‌డే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను అవతార్: ఫైర్ అండ్ అష్‌తో చూపించనున్నట్టు ప్రచారం ఉంది. దాంతో అవతార్ విడుదల భారీ ప్రమోషన్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది.
ఇప్పుడు నిర్ణయం పూర్తిగా రాజమౌళి, నిర్మాతలు, మార్కెటింగ్ టీమ్ చేతుల్లోనే ఉంది. వారు ఈ ప్లాన్‌ను ఓకే చేస్తే, వారణాసి అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అభిమానులు ఈ అవకాశంపై చాలా ఎగ్జైట్ అయి, రాజమౌళి గారు ఈ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు.
అవతార్: ఫైర్ అండ్ అష్ సినిమా 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఇప్పుడు అందరి దృష్టి, ఆ స్క్రీనింగ్ సమయంలో వారణాసి గ్లింప్స్ కనిపిస్తుందా లేదా అన్నదానిపైనే ఉంది.
Follow Us