Pooja Hegde in Retro: 'రెట్రో' కోసం పూజా షాకింగ్ డెసిషన్..!

పూజా హెగ్డే, సూర్యతో కలిసి నటిస్తున్న 'రెట్రో' మూవీ కోసం తొలిసారి తన సొంత డబ్బింగ్ చెప్పబోతున్నారు. తమిళ భాష నేర్చుకోవడానికి ప్రత్యేకంగా టీచర్‌ను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల కానుంది.

New Update
Pooja Hegde in Retro

Pooja Hegde in Retro

Pooja Hegde in Retro: పూజా హెగ్డే ప్రస్తుతం తమిళ్లో వరుస సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న 'కూలీ'(Coolie) మూవీ లో ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ అనౌన్సమెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు కూలీ మూవీ యూనిట్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సూర్యా తో కలిసి చేస్తున్న 'రెట్రో' మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది.

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్

స్వంత గాత్రంతో డబ్బింగ్‌..

అదేంటంటే, తమిళంలో బుట్టబొమ్మ  స్వంత గాత్రంతో డబ్బింగ్‌ చెప్పేందుకు సిద్ధమవుతోందట. రెట్రో మూవీలో తన డబ్బింగ్ తానే స్వయంగా చెప్తోంది పూజా. అందుకోసం ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకంగా ఒక టీచర్‌ను పెట్టుకుని మరీ తమిళ భాష నేర్చుకుంటుందట. అయితే అమ్మడి డెడికేషన్ లెవెల్స్ చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!

ఇటీవల విడుదలైన రెట్రో గ్లింప్స్‌లో పూజా లుక్‌ను చూసిన ఫ్యాన్స్‌ మూవీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెట్రో మూవీ సమ్మర్‌ స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతుంది. షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. ప్రేమ, యాక్షన్‌, వినోదం కలగలిపిన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇందులో పూజా హెగ్డే 'దేవి' అనే పాత్రలో కనిపించనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు