సినిమా రంగానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. లాస్ ఏంజెల్స్ వేదికగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ఇండియన్ సినిమాకు నిరాశే మిగిలింది. పాయల్ కపాడియా చిత్రం 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్' దురదృష్టవశాత్తు రెండు విభాగాల్లోనూ అవార్డులు గెలుచుకోలేకపోయింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో పోటీలో నిలిచిన ఈ చిత్రానికి రెండు విభాగాల్లోనూ అవార్డు దక్కలేదు. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ గా స్పెయిన్‌కు చెందిన ఎమిలియా పెరెజ్‌కి అవార్డు దక్కగా... ఉత్తమ దర్శకుడి విభాగంలో ది బ్రూటలిస్ట్ చిత్రానికి గానూ బ్రాడీ కార్బెట్ కు అవార్డు దక్కింది. రెండు కేటగిరీల్లోను దానికి అవార్డు రాకపోవడంతో సినీప్రియులు నిరాశకు గురయ్యారు. అయితే దీనికి ఏం నిరుత్సాహ పడాల్సిన పనిలేదని.. ఇది భారతీయ సినిమాకు పెరుగుతున్న ప్రపంచ గుర్తింపును ఇస్తుందంటూ సినీ లెజెండ్స్ అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది చివర్లో నామినేషన్లు ప్రకటించినప్పుడు గోల్డెన్ గ్లోబ్స్‌లో ఉత్తమ దర్శకురాలిగా ఎంపికైన మూడవ ఆసియా మహిళగా పాయల్ కపాడియా నిలిచింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డును త్రిబుల్ ఆర్ దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు" పాటకు వరించింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా కీరవాణి రికార్డు క్రియేట్ చేశారు. సినిమా కథ ఇదే ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమా కథ విషయానికి వస్తే.. కని కుశ్రుతి, దివ్య ప్రభ మెయిన్ పాత్రాల్లో కనిపించారు. ముంబైకి చెందిన ఓ నర్సింగ్‌హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల (ప్రభ, అను) కథే ఈ ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. ప్రభ, అను పనిచేసే ఆస్పత్రిలోనే వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది పార్వతి (ఛాయా కదమ్). అయితే జీవితంలో ఎదురవుతున్న సమస్యలను తట్టుకోలేక పార్వతి తన సొంతూరైన రత్నగిరికి వెళ్లాలని అనుకుంటుంది. ఆమెతో పాటుగాప్రభ, అను కూడా రత్నగిరికి వెళ్తారు. అక్కడికి వెళ్లాక వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా. తెలుగులో ఈ సినిమాను హీరో రానా విడుదల చేయగా.. డిస్నీ + హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది. అయితే రెండు విభాగాల్లోనూ ఈ సినిమా అవార్డులు రాకపోవడం బాధకరమనే చెప్పాలి.