రమణ గోగులకు పవన్ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..?

సింగర్ రమణ గోగుల ఇటీవల వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో పాట పాడిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను పవన్ కళ్యాణ్ కు కూడా ఓ సాంగ్ పాడాలని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు పెడుతున్నారు.

New Update
ramana gogula

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్  రిలీజైన విషయం తెలిసిందే. 'గోదారి గట్టు మీద రామ చిలకవే' అంటూ సాగే ఈ పాటను ఒకప్పటి ఫేమస్ సింగర్ రమణ గోగుల పాడడంతో యూట్యూబ్ లో ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది. 

సుమారు 18 ఏళ్ళ తర్వాత రమణ గోగుల.. వెంకటేష్ సినిమాకు పాట పాడటం విశేషం. అప్పట్లో వీరి కాంబోలో వ‌చ్చిన ప్రేమంటే ఇదేరా, ల‌క్ష్మీ చిత్రాలు మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. అందులోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మళ్ళీ ఇన్నేళ్లకు రమణ గోగుల గాత్రం వినిపించడంతో మ్యూజిక్ లవర్స్ ఈ పాటను రిపీట్ మోడ్ లో వింటున్నారు. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 30 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. 

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..?

ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..

అయితే ఈ సాంగ్ ను విన్న పవన్ ఫ్యాన్స్ మాత్రం వెంకీమామకు పాడినట్లే.. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు కూడా ఓ సాంగ్ పాడాలని రమణ గోగులకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. పవన్ - రమణ గోగుల కాంబో ఒకప్పుడు ఎంత ఫేమస్ అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 

publive-image

తమ్ముడు, బద్రి, జానీ వంటి చిత్రాలు ఎంతటి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ సినిమాలో రమణ గోగుల పాట పాడాడంటే అది చార్ట్ బస్టరే. అందుకే ఇప్పుడు ఆయన నటిస్తున్న 'ఓజీ' లో రమణ గోగుల పాట పాడితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ కోరికను 'ఓజీ' మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తీరుస్తాడేమో చూడాలి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు