Oscar 2026 : ఆస్కార్‌ వేదికపై అరుదైన దృశ్యం: ఒకే అవార్డు.. ఇద్దరు విజేతలు!

ఆస్కార్ వేదికపై అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కేటగిరీకి ఇద్దరు విజేతలుగా నిలవడంతో టైగా ముగిసింది. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇది ఏడోసారి కావడం విశేషం.

New Update
Oscars

ఆస్కార్(Oscar 2026) వేదికపై అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కేటగిరీకి ఇద్దరు విజేతలుగా నిలవడంతో టైగా ముగిసింది. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇది ఏడోసారి కావడం విశేషం. గతంలో 2012లో 'బెస్ట్ సౌండ్ ఎడిటింగ్' విభాగంలో ఇలా జరిగింది. అంతకంటే ముందు 1995లో ఇదే షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో, అలాగే 1969లో బెస్ట్ యాక్ట్రెస్ (కాథరిన్ హెప్బర్న్, బార్బరా స్ట్రీసాండ్), 1932లో బెస్ట్ యాక్టర్ విభాగాల్లో కూడా విజేతలు సమానంగా నిలిచారు.

ఈ విభాగంలో నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ది సింగర్స్, కెనాల్+/ది న్యూయార్కర్ రూపొందించిన 'టూ పీపుల్ ఎక్స్ఛేంజింగ్ సెలైవా' చిత్రాలు సంయుక్తంగా అవార్డును గెలుచుకున్నాయి. ఒక వింతైన, భిన్నమైన చిత్రాన్ని ఆదరించినందుకు అకాడమీకి చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది.

Also Read :  కొత్త కోడలికి ఏమైంది.. రష్మిక ఫ్యాన్స్ టెన్షన్.. పెళ్లైన కొద్ది రోజులకే!

సుదీర్ఘ నిరీక్షణకు

సినిమా ప్రపంచంలో దిగ్గజ దర్శకుడిగా పేరున్న పాల్ థామస్ ఆండర్సన్ ఎట్టకేలకు తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు. కెరీర్ మొదలై దాదాపు 30 ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు అందని ఆస్కార్ అవార్డును ఆయన ఈ ఏడాది కైవసం చేసుకున్నారు. 2026 ఆస్కార్ వేడుకల్లో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్  సినిమాకు గానూ ఆయనకు 'బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే' విభాగంలో ఈ అవార్డు దక్కింది.

ఈ సందర్భంగా స్టేజ్ మీద ఆయన మాట్లాడుతూ.. ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని, ఈ సినిమా కథకు మూలకారకుడైన నవలా రచయిత థామస్ పించన్‌కు తాను రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఒక ఎమోషనల్ విషయాన్ని కూడా పంచుకున్నారు. "ఈ ప్రపంచాన్ని మనం ఉన్నదానికంటే అధ్వాన్నంగా మార్చి మన పిల్లలకు ఇస్తున్నందుకు వారికి క్షమాపణలు చెబుతూనే, రాబోయే తరం వారు తమ తెలివితేటలతో మళ్లీ ఈ లోకాన్ని బాగు చేస్తారనే నమ్మకంతో ఈ సినిమా తీశాను" అని ఆయన అన్నారు.

పాల్ థామస్ ఆండర్సన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 14 సార్లు ఆస్కార్ నామినేషన్లు పొందారు. గతంలో ఆయన తీసిన 'బూగీ నైట్స్', 'లికోరైస్ పిజ్జా', 'దేర్ విల్ బి బ్లడ్' వంటి సినిమాలకు నామినేషన్లు వచ్చినా అవార్డు మాత్రం దక్కలేదు. ఎట్టకేలకు 98వ ఆస్కార్ వేడుకల్లో ఆయన కల నెరవేరింది.

Also Read :  ఇట్స్ ట్రైలర్ టైమ్‌.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగయా!

Advertisment
తాజా కథనాలు