Ustaad Bhagat Singh: "ఉస్తాద్ భగత్ సింగ్" పెయిడ్ ప్రీమియర్స్ ఎందుకు లేవంటే..?

ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది రోజున విడుదల కావడంతో పెయిడ్ ప్రీమియర్స్ పెట్టలేదు. తెల్లవారుజామునే షోలు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా హరీష్ శంకర్, శ్రీలీల, రాశి ఖన్నా కెరీర్‌కు కీలకంగా మారింది. మంచి హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని అందరూ ఆశిస్తున్నారు.

New Update
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా రేపు భారీగా విడుదలకు సిద్ధమైంది. రిలీజ్‌కు ముందు చిత్రబృందం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్లు శ్రీలీల, రాశి ఖన్నా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సినిమా టీమ్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాకు ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ ఎందుకు పెట్టలేదో వివరించారు. ఈ చిత్రం ఉగాది పండుగ రోజు విడుదల అవుతున్నందున, ముందురోజు ప్రీమియర్ షోలు కంటే అదే రోజు తెల్లవారుజామున షోలు వేయడం మంచిదని భావించినట్లు చెప్పారు. పైగా ఇది కమర్షియల్ సినిమా కావడంతో ప్రీమియర్‌లను మానేశారు.

ఈ సినిమాలో విలన్ పాత్రలో ఆర్. పార్థిబన్ నటిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ఎస్. థమన్ అందించగా, పాటలను దేవి శ్రీ ప్రసాద్ రూపొందించారు.

ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కు ‘ఓజీ’ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ రావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

ఈ సినిమా విజయం దర్శకుడు హరీష్ శంకర్‌కు చాలా కీలకం. ఆయన గత సినిమా ‘మిస్టర్ బచ్చన్’ ప్లాప్ అయింది. అందుకే ఈసారి మంచి హిట్ ఇవ్వాలని ఆయన కష్టపడుతున్నారు. ఈ సినిమా ఫలితం ఆయన కెరీర్‌కు చాలా కీలకం.

హీరోయిన్ శ్రీలీలకు కూడా ఈ సినిమా చాలా ముఖ్యమైనది. ఇటీవల ఆమెకు సరైన హిట్ లేకపోవడంతో, ఈ సినిమా ద్వారా తిరిగి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. అలాగే రాశి ఖన్నా కూడా ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఆశిస్తోంది.

మొత్తానికి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నటీనటులు, దర్శకుడి కెరీర్‌కు కీలకంగా మారింది. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు